అన్వేషించండి

Tungabhadra Dam Gate: తుంగభద్ర డ్యాం భద్రమేనా ? గేటు ఎలా కొట్టుకుపోయింది? చుట్టుముడుతున్న అనుమానాలు

Tungabhadra Dam Gate Break: తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం శ్రమిస్తున్నారు.

Kurnool News: ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయంలోని 19వ గేటు వరద ప్రవాహానికి చైన్ లింకు తెగి కొట్టుకు పోయింది. దీంతో జలాశయంలోని నీరు లక్ష క్యూసెక్కులకుపైగా నదిలోకి వెళ్తుంది. తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో అసలు తుంగభద్ర జలాశయం ఇతర గేట్ల పరిస్థితి ఎలా ఉంది. గేటు కొట్టుకపోవడానికి నిర్వహణ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు సమీక్షిస్తున్నారు. 

తుంగభద్ర జలాశయంలోకి ఎగువ కర్ణాటకలో ముందస్తుగా కురుస్తున్న భారీగా వరద నీరు చేరింది. జలాశయం కెపాసిటీ 105 టీఎంసీలు. ఇప్పటికే జలాశయంలో వరద ప్రవాహానికి 105 టీఎంసీల నీరు చేరింది. ఎగువన వర్షాలకు వరద నీరు వస్తుండడంతో 33 గేట్లు ఉన్న తుంగభద్ర జలాశయం 29 గేట్ల ద్వారా నీటిని నదిలోకి డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో గత శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తుతున్న టైంలో 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకపోయింది. 

 అధికారుల తప్పిదమా ? 
తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంలో ఎవరి తప్పిదం ఉంది అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాన్ రైనీ సీజన్‌లో డ్యాం నిర్వహణను సరిగా జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. డ్యాం భద్రత గేట్ల మెయింటెనెన్స్ గ్రీస్ చైన్స్ ఇలాంటివన్నీ కూడా అధికారులు దగ్గరుండి పరిరక్షించాల్సి ఉంది. 

డ్యాం అధికారులు మాత్రం ఈ ఏడాది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. చైన్లకు గ్రీసు పూయడం ఇతర నిర్వహణ పనులు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ముందు డ్యామ్‌ను పరిశీలించి జాతీయ డ్యామ్‌లా బద్రతసంస్థకు అంత సవ్యంగానే ఉన్నట్లు చెప్పిన నివేదికను అధికారులు చూపిస్తున్నారు. డామ్ నిర్వహణ పనులు సవ్యంగా జరిగే ఉంటే డ్యాంలోని 19వ డేటు ఎందుకు కొట్టుకుపోయింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

డ్యామ్ గేట్ల లైఫ్ టైం ఎంత ? 
ఏదైనా డ్యాం నిర్మాణం చేపట్టడంలో గేట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. నీటి నిల్వను అడ్డుకునేందుకు నీటిని దిగువకు వదలడానికి డ్యామ్ గేట్లను ఏర్పాటు చేస్తారు. డ్యామ్ నిర్మాణాన్ని డాం కెపాసిటీని బట్టి డ్యామ్ గేట్లను ఏర్పాటు చేస్తారు. అయితే ఇందుకు సంబంధించి ఒక్కొక్క గేటు సుమారు 40 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కొక్క గేటు జీవితకాలం 40 నుంచి 45 ఏళ్లు ఉంటుంటుంది. తుంగభద్ర జలాశయంలో మాత్రం డ్యాం నిర్మాణం చేపట్టడం నుంచి ఇప్పటివరకు అవే గేట్లు వాడుతున్నారు ఇప్పటివరకు సుమారుగా అంటే 69 ఏళ్లుగా తుంగభద్ర జలాశయంలో అవే గేట్లను వాడుతున్నారు. 

తుంగభద్ర జలాశయంలో స్టాప్ లాక్ సిస్టం లేదా ? 
ఎక్కడైనా డ్యాంల నిర్మాణం చేపడుతున్నప్పుడు డ్యాం గేటు కొట్టుకుపోయినప్పుడు స్టాప్ లాక్ సిస్టంను అధికారులు ఏర్పాటు చేస్తారు. తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపడుతున్న సమయంలో స్టాప్ లాక్ సిస్టం లేకపోవడంతోనే నీటిని అడ్డుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తుంగభద్ర జలాశయం 69 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టారు. అప్పట్లో స్టాప్ లాక్ సిస్టం లేకుండానే డ్యాం నిర్మాణం చేపట్టారు. కేవలం చైన్ లింకు ద్వారానే గేట్లను ఆపరేట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. నాలుగేళ్ల క్రితం  కేంద్ర జల సంఘం తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించంది స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు లేదా ఏదైనా ప్రత్యాన్యయం చూడాలని సూచించింది. లేకుంటే డ్యామ్‌కే నష్టమని సిడబ్ల్యుసి చెప్పిందని ఎలా ఉండాలో సూచించలేదని ఒక సీనియర్ ఇంజనీర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ముమ్మరంగా కొనసాగుతున్న పనులు : 
తాత్కాలిక గేట్లను అమర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 19వ గేటు దగ్గర పనులను చురుకుగా చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొంత పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. తాత్కాలిక గేటును పెట్టేందుకు ప్రోసాహళ్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు మరో రెండు మూడు రోజులు సమయం పట్టేలా ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి గేట్లు ఏర్పాటు చేయాలంటే డ్యాం లోని 60 టీఎంసీ నీరు బయటకు వెళ్లేంతవరకు ఏర్పాటు చేయలేమని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget