అన్వేషించండి
Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగి కారు దగ్ధం, భారీగా ట్రాఫిక్ జామ్
Andhra Pradesh News | తిరుమల ఘాట్ రోడ్డులో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోేనే రోడ్డుమీదే మంటల్లో దగ్దమైంది.

తిరుమల ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగి కారు దగ్ధం, భారీగా ట్రాఫిక్ జామ్
Source : ABP Desam
తిరుమల: తిరుమల శ్రీవారి క్షేత్రం సమీపంలో కారు దగ్ధమైంది. తిరుమల ఘాట్ రోడ్డులోని మోకాళ్ల మెట్ల వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ రావడంతో ప్రయాణికులు కారు నుండి దిగి బయటకు వచ్చారు. అంతే.. సెకన్ల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ఆపై వారు చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో కారు అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నిమిషాల్లో అక్కడికి చేరుకుని కారు మంటలు ఆర్పేసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు కాలిపోవడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్






















