అన్వేషించండి

Anantha Babu: ద‌ళిత డ్రైవ‌ర్ హ‌త్య‌కేసులో న్యాయ‌విచార‌ణ షురూ.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగుస్తున్న ఉచ్చు..

ద‌ళిత కారు డ్రైవ‌ర్ ను అత్యంత దారుణంగా హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు ఉచ్చు బిగుస్తోంది.. ఏపీ ప్ర‌భుత్వం న్యాయ విచార‌ణ‌కు ఆదేశించింది..

YSRCP MLC Anantababu | కాకినాడ: త‌న ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న ద‌ళిత కారు డ్రైవ‌ర్ వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం ను హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిపై త‌మకు ఇంకా స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ మృతుడి కుటుంబికులు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపై న్యాయ విచార‌ణ చేప‌ట్టి న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌డు ఏపీ ప్ర‌భుత్వం ఈ సంఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించింది.. 

అత్యంత దారుణంగా హ‌త్య చేసి ఆపై.. 

కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం రంప‌చోడ‌వ‌రంకు చెందిన వైసీసీ ఎమ్మెల్సీ అనంత‌బాబు ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు.. చాలా కాలంగా ప‌నిచేస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యం మానేశాడు.. ఇదిలా ఉంటే 2022 మే 19న ఇంటి నుంచి వెళ్లిన సుబ్ర‌హ్మ‌ణ్యం తిరిగి రాలేదు. అయితే తెల్ల‌వారు జామున ఓ కారులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహం తీసుకొచ్చి వ‌దిలి వెళ్లిపోయాడు. ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లొ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. ద‌ళిత సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగాయి.. అయితే వైసీపీ ప్ర‌భుత్వం నిందితున్ని కాపాడుతోంద‌ని ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తాయి.. ఈక్ర‌మంలోనే అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు పై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్ట్‌చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు పోలీసులు.. 

బాధిత కుటుంబానికి అండ‌గా... 

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు డోర్ డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్ కు  సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ మరియు మానవ హక్కుల రక్షణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ముప్పాళ్ళ సుబ్బారావును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 538 ని విడుదల చేసింది.  దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ముప్పాళ్ళ సుబ్బారావు అండగా నిలిచారు. వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు నేనున్నానంటూ నిలబడ్డారు. ముప్పాళ్ళ సుబ్బారావు మడమతిప్పని పోరాటం వల్ల ఎమ్మెల్సీ అనంత బాబుకు స్థానిక న్యాయస్థానాల్లో బెయిల్ లభించలేదు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం అనంత బాబు బెయిల్ పై ఉన్నారు. 

చార్జిషీట్‌ను తిర‌స్క‌రించిన న్యాయ స్థానం..

ద‌ళిత యువ‌కుడు వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితులు త‌ప్పించుకునే విధంగా పోలీసులు చార్చిషీట్ రూప‌క‌ల్ప‌న చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. హ‌త్య సంఘ‌ట‌న అనంత‌రం 88 రోజుల‌కు దాఖ‌లు చేసిన చార్చిషీట్‌ను అప్ప‌ట్లో న్యాయ స్థానం తిర‌స్క‌రించింది. అందులో సాంకేతి ఆధారాలు, నిందితుల క‌ద‌లిక‌లు త‌దిత‌ర అంశాలు లేకుండా చార్జిషీట్‌లో లేక‌పోవ‌డ‌మే తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌ని బాధితుల త‌ర‌పున వాదించిన న్యాయ‌వాది సుబ్బారావు వెల్ల‌డించారు. 2023 ఏ్ర‌పిల్ 14న అనుబంధ చార్జిషీట్‌ను వేశారు. గ‌డువులో దాఖ‌లు చేయ‌కుండా నిందితుడుకు బెయిల్ వచ్చేవిధంగా అప్ప‌టి ఎస్పీ, డీఎస్పీ ఆల‌స్యం చేశార‌ని విమ‌ర్శ‌లున్నాయి.. అప్ప‌ట్లో తానే హ‌త్య‌చేశాన‌ని విచార‌ణ‌లో ఎమ్మెల్సీ అనంత‌బాబు అంగీక‌రించిన‌ట్లు మీడియా స‌మావేశంలో ఎస్పీ వెల్ల‌డించారు కూడా.. చార్చిషీట్ ఆల‌స్యం వ‌ల్ల‌నే మ‌ద్యంత‌ర బెయిల్ వ‌చ్చింద‌ని ద‌ళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే మృతుడి త‌ల్లితండ్ర‌లు నూకాల‌మ్మ‌,స‌త్య‌నారాయ‌ణ‌లు మాత్రం మూడేళ్లుగా న్యాయ‌పోరాటం చేస్తున్నారు. 

కూట‌మి ప్ర‌భుత్వంతో న్యాయం జ‌రిగేనా.. 

ఈ కేసును రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  బాధితులకు న్యాయం జరిగేలా విచారణకు ఆదేశిస్తారని భావిస్తూ వచ్చారు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రత్యేక కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక న్యాయవాదిగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ముప్పాళ్ళ సుబ్బారావును ఈ కేసులో సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా నియమించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబంతో పాటు దళితుల్లోనూ కలుగుతోందంటున్నారు.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Embed widget