X

AP Employees Unions : ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసులు.. డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక ఉద్యమమే..!

ఏపీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సీఎస్‌కు ఉద్యమకార్యాచరణ నోటీసులు ఇచ్చారు. 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగ నేతలు తెలిపారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.  పీఆర్సీని వెంటనే ప్రకటించాలని.. డీఎ బకాయిలు చెల్లించాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఉద్యమ బాట పడుతున్నట్లుగా పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్ సమీర్ శర్మకు నోటీసులు ఇచ్చారు. ఉద్యమం పూర్తి స్థాయిలో పట్టాలెక్కక ముందే ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.

Also Read : ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం చేసుకోవాలి.. లోక్‌సభలో రఘురామ విజ్ఞప్తి !

ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట‌్ అని చెబితే మురిసిపోయామని కానీ ఆ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయని ఉద్యోగ సంఘ నేతలు విమర్శలు గుప్పించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని అయినా స్పందన లేదన్నారు. ఉద్యమ కార్యాచరణను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమన్నారు.  కరోనా సమయంలో నాలుగున్నరవేల మంది ఉద్యోగులు చనిపోయారని.. ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు. 

Also Read : ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న 'జవాద్' సైక్లోన్ .. ఎక్కడుందో లైవ్ చూడండి!

ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయని ఉద్యోగ సంఘం నేతలు విమర్శఇంచారు. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమన్నారు. కానీ బుగ్గన ఒక్క రోజు కూడా ఉద్యోగులతో మాట్లాడలేదన్నారు. ఆయన అందుబాటులో ఎప్పుడూ లేరన్నారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించాలన్నారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావన్నారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Also Read: Sirivennela Live: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..
 
ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా 7వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తారు.  13న తాలూకా, డివిజన్‌ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

Also Read: AP Govt OTS : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: ANDHRA PRADESH cm jagan cs sameer sharma AP PRC Report Job Union Leaders AP Employees Struggle

సంబంధిత కథనాలు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Employess Strike :  సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Employees Unions : జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

AP Employees Unions :  జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ