By: ABP Desam | Updated at : 01 Dec 2021 12:07 PM (IST)
Edited By: Rajasekhara
ఏపీలో ఓటీఎస్ దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విపక్ష రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. మా ఇళ్లను మళ్లీ మాకు ఇచ్చేందుకు డబ్బులు కట్టడం ఏమిటని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పేద ప్తరజల నుంచి రూ. 1500 కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరూ ఒక్క పైసా కట్టవద్దని టీడీపీ వచ్చిన తర్వాత ఉచితంగా అందరికీ రిజిస్ట్రేషన్లు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీఎస్ పథకం కిందకు వచ్చే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వాలంటీర్లపై ఒత్తిడి పెంచుతోంది. ఈ కారణంగా పథకంపై రాజకీయం జోరుగా సాగుతోంది.ఇంతకీ ఓటీఎస్ అంటే ఏమిటి..? ప్రజలు ఎందుకు డబ్బులు కట్టాలి ? ప్రభుత్వం ఆర్థిక సమస్యలను తీర్చుకునేందుకు ప్రజలవద్ద డబ్బులు వసూలు చేస్తోందా..?
Also Read : హోదా ముగిసిన అధ్యాయం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చేసిన కేంద్రం !
ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ పథకం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వన్ టైం సెటిల్మెంట్ పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకంలో 46,61,737 మంది లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. వీరంతా రూ. పది నుంచి 30వేల వరకూ కడితే వారు ఉంటున్న ఇళ్లపై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్‌గా పరిగణించి మాఫీ చేసి.. ఉంటున్న ఇంటికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అయితే వీరంతా ప్రైవేటు సంస్థల్లో హోమ్ లోన్లు తీసుకున్న వారు కాదు. ప్రభుత్వ గృహనిర్మాణ సంస్థ ఇళ్లు కేటాయించిన వారు. అదీ కూడా రాజీవ్ స్వగృహ వంటి లబ్దిదారులు కాదు. పేదలకు ఇళ్ల పథకాలకింద ఇళ్లు పొందిన వారు .
1983 నుంచి ఇళ్లు పొందిన వారందరికీ పథకం వర్తింపు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు నిర్మించండం 1983 నుంచి ప్రారంభమయింది. అప్పట్లో హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించి పేదలకు ఇళ్లు ఇస్తున్నారు. సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఒక్కో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కో పేరు పెట్టేవారు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు అని పెట్టారు. టీడీపీ ఉన్నప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పేరుతో ఇచ్చేవారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి. అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు ప్రభుత్వమే కదా అని చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా అడగడం లేదు. దాంతో ఆ లోన్లు అలాగే ఉండిపోయాయి. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు లోన్ పూర్తి కాకపోవడం వల్ల వారిపైకి మారలేదు. సీఎం జగన్ వారికి వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించి రుణవిముక్తుల్ని చేసి వారి ఆస్తులకు వారినే యజమానులకు చేయాలని నిర్ణయించుకుని పథకాన్ని ప్రవేశ పెట్టారు.
పేదలను దోపిడి చేస్తున్నారని విపక్షాల విమర్శలు !
ముఫ్పై, నలభై ఏళ్ల కింద తీసుకున్న రుణాలు... రూ. ఎనిమది.. పది వేలే ఉంటాయి. అయితే ఇప్పుడు అంత కంటే ఎక్కువ చెల్లించమని ప్రభుత్వం అడుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల రుణాలు కూడా రూ. ఇరవై, ముప్ఫై వేల మధ్యలోనే ఉంటాయి. వాటిని ఇప్పుడు ప్రభుత్వం చెల్లించమని అడుగుతోంది. అసలు పేదలు కిస్తీలు కట్టడం మానేసిన ఏళ్ల తర్వాత వాటిని మాఫీ చేయాల్సింది పోయి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో తీసుకున్న రుణాలను ఈ ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. వారు నిరుపేదలని.. అందుకే కట్టలేకపోయారని.. ఇప్పుడు వారి నుంచి మక్కుపిండి వసూలు చేయడమేమిటన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
పేదలు ఒక్క రూపాయి కట్టవద్దని టీడీపీ పిలుపు !
తెలుగుదేశం పార్టీ ఈ ఓటీఎస్ స్కీమ్ ప్రజల్ని దోపిడీ చేసేదని మండిపడుతోంది. పేద ప్రజలు ఎవరూ ఒక్క రూపాయి కట్టవద్దని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని హామీ ఇస్తోంది. ప్రభుత్వం దారి దోపిడి చేస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా వివిధ సమస్యలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం రూ.10 వేలు కట్టాలంటూ వాలంటీర్లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.(1/2) pic.twitter.com/XLWw1lVKd4
— Lokesh Nara (@naralokesh) November 26, 2021
Also Read : పేదల ఇళ్ల నిర్మాణాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్లు !
డబ్బులు కట్టించాలని అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి !
ఓటీఎస్ పథకాన్ని సక్సెస్ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకే గ్రామ వాలంటీర్ స్థాయిలో లబ్దిదారులందర్నీ గుర్తించి ఆ మేరకు వారికి ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా చోట్ల పేదలు కట్టడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కట్టకపోతే పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి అదికారులు అధికారికంగా హెచ్చరించడం వివాదాస్పదం అయింది.
Also Read : ఏపీకి వరద సాయం చేయండి... రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల విజ్ఞప్తి !
ప్రభుత్వం టార్గెట్ - అధికారులు, లబ్దిదారులకూ టెన్షన్ !
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ డిసెంబరు 21 నుంచి ప్రారంభించనున్నారు. సచివాలయాలు, మండలం, పట్టణాల వారీగా లక్ష్యం నిర్దేశించారు. ప్రతి మండలానికి రోజుకు 50, పట్టణంలో సచివాలయానికి 5 చొప్పున ఓటీఎస్ కింద కట్టించాలని టార్గెట్ పెట్టారు. వార్డు, గ్రామ వాలంటీరు రోజుకు ఒకటి, పంచాయతీ కార్యదర్శి 3కు తక్కువ లేకుండా చూడాలని మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇలా అందరికీ ఒక్కో తరహా లక్ష్యం విధించారు। దీంతో అందరూ పరుగులు పెడుతున్నారు. అయితే లబ్దిదారుల్లో అత్యధికులు డబ్బులు కట్టేందుకు ముందుకు రావడం లేదు. కట్టవద్దని విపక్షాలు ప్రచారం చేయడం కూడా కారణం అవుతోంది. ప్రభుత్వం ఇలా పేదల నుంచి తీసుకోవడం ఏమిట్న విమర్శలు లబ్దిదారుల నుంచి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కట్టించుకుని తీరాలన్న లక్ష్యంతో ఉంది.
Also Read : వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
తిరుపతి కంటే ముందే అప్పనపల్లిలో నిత్యాన్నదానం- బాలబాలాజీ పుణ్యక్షేత్రం అంటే అంత ఫేమస్!
Top 10 Headlines Today: ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు; సీఎం జగన్ కీలక హామీ - నేటి టాప్ 5 న్యూస్
Employees Meet CM Jagan : 60 రోజుల్లో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు - ఉద్యోగులకు సీఎం జగన్ భరోసా !
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
TDP News : కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్ - చంద్రబాబుకు మాటిచ్చారట !
2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ