IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !

వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం సీఎం జగన్‌ను కలిసింది. విపత్తు నిర్వహణలో అద్భుతంగా పని చేశారని జగన్‌ను ప్రశంసించారు. నిధులు వేగంగా విడుదలయ్యేలా చూడాలని సీఎం జగన్ వారిని కోరారు.

FOLLOW US: 

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వరదల పరిస్థితిని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం  అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయింది. వరద బాధిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను ప్రశంసించింది. వరద బాధిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎంకు వివరించారు. మూడు రోజుల పాటు వరద బాధితుల ప్రాంతాల్లో పర్యటించామని.. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లినట్లుగా గుర్తించామని సీఎంకు తెలిపారు. కొట్టుకుపోయిన గ్రామాలను కూడా పరిశీలించామని.. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు.  జగన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని... అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారని ప్రశంసించారు.

Also Read : భారీ వర్షాల ఎఫెక్ట్.. నెల్లూరు-చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం.. కి.మీ మేర నిలిచిన వాహనాలు

పర్యటనలో రాజకీయ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కూడా కలిశామని.. అందరూ రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని తెలిపారు.  సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని.. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే సామర్థ్యం అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని.. అలాగే  వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా లేవన్నారు.  అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉందని.. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని కేంద్ర బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. 

Also Read: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు 

కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.  బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని.. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమన్నారు. సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారని..  దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయని కూడా అభినందించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును తాము చూడలేదని వారు ఆశ్చర్యపోయారు.

Also Read : కండలేరు రిజర్వాయర్‌కు గండీ పడనుందా? అసలు నిజం ఏంటంటే.. Also Read : కండలేరు రిజర్వాయర్‌కు గండీ పడనుందా? అసలు నిజం ఏంటంటే..

వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది..వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.  భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నందున ధాన్యం సేకరణ విషయంలో తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని ప్రభుత‌్వం కేంద్ర బృందాన్ని కోరారు.

Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు

ఇలాంటి విపత్తు హృదయవిదారకమని... ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నానని జగన్ వారికి విజ్ఞప్తి చేశారు.  మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు ..నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందని.. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంట కూడా ఈ క్రాప్‌ అయ్యిందన్నారు. సోషల్‌ ఆడిట్‌ కూడా చేయించామని..ఈ -క్రాప్‌కు సంబంధించి రశీదు కూడా రైతుకు ఇచ్చామని గుర్తు చేశారు. నష్టపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయని వారికి జగన్ తెలిపారు.  కోవిడ్‌ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని ..పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని జగన్ కోరారు.దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Also Read: Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Nov 2021 04:31 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan nellore floods Rayalaseema floods central team Central team congratulates Jagan

సంబంధిత కథనాలు

Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Breaking News Live Updates: బిహార్‌లో రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం

Breaking News Live Updates: బిహార్‌లో రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం

MLC Anantha Udaya Bhaskar Arrest: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు ! ఎందుకు ప్రకటించడం లేదో !

MLC Anantha Udaya Bhaskar Arrest: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు ! ఎందుకు ప్రకటించడం లేదో !

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు

MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ గన్‌మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్​

MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ గన్‌మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్​
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KTR On Petrol Price: పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్

KTR On Petrol Price: పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్

Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ

Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ

Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు

Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్