NTR Health University: ఎన్టీఆర్ వర్సిటీ నిధుల మళ్లింపు... ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు.. అప్పులు దొరక్క నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం
ఎన్టీఆర్ వర్సిటీ నిధులు మళ్లింపుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు వర్సిటీ ఉద్యోగులు ప్రకటించారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపుపై వివాదం ముదురుతోంది. నిధుల మళ్లింపుపై ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతున్నారు. సోమవారం వర్సిటీ నిధులు ప్రభుత్వ ఖజానాకు బదలాయించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు తెలియకుండా ఈ బదలాయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వర్సిటీ నిధులు రూ. 400 కోట్లను స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అధికారులు మళ్లించారు. ఈ విషయంపై అధికారులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. దీంతో విధులకు హాజరు కాబోమని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు.
Also Read: పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
అప్పులు దొరక్క నిధులు మళ్లింపు
విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన బాటపట్టారు. రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు వర్సిటీ ఉద్యోగులు ప్రకటించారు. వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. నిధుల మళ్లింపుపై ఉద్యోగులు సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం వర్సిటీలో నిరసన ర్యాలీ చేశారు. ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. వర్సిటీ నిధులను కాపాడతామని వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఆందోళన చేస్తామన్నారు. వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు తెలియజేస్తామన్నారు. సీఎంవో ఒత్తిడితో వర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పులు దొరక్క సంస్థల నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోండి... ప్రధానికి ముద్రగడ లేఖ !
రెండు వారాల్లో సీన్ రివర్స్
నవంబర్ 9న ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ నుంచి ఎన్టీఆర్ వర్సిటీకి ఓ లేఖ వచ్చింది. వర్శిటీ నిధులు బదలాయించాలని ఈ లేఖలో సారాంశం. దీనిపై వర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్సిటీ నిధులు జాతీయ బ్యాంకులు మినహా ఎక్కడికి బదలాయించే పరిస్థితి లేదన్నారు. అప్పటి నుంచి వర్సిటీ ఉన్నతాధికారులపై ఉన్నతాధికారుల ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో వర్సిటీ వీసీ నిధులు మళ్లించేందుకు ఒప్పుకున్నారు. ఈ నిధుల మళ్లింపుపై వార్తలు రావడంతో మళ్లింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 13న జరిగిన సమావేశంలో జాతీయ బ్యాంక్‌ల మాదిరిగానే స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కూడా టెండర్లలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం టెండర్లు ఆహ్వానించి ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వారికి డిపాజిట్ చేస్తామని ఈసీ మెంబర్లు తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఈసీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని వీసీ డా.పి.శ్యామ్‌ప్రసాద్, రిజిస్ట్రార్ డా.శంకర్ మీడియాకు తెలిపారు. కానీ రెండు వారాల్లో మొత్తం సీన్ రివర్స్ అయింది. నగదు ప్రభుత్వ ఖజానాకు బదలాయింపు అయ్యింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి