CM Jagan : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు విద్యాదీవెన నిధులు...10 రోజుల్లోగా కాలేజీలకు కట్టాలని సీఎం జగన్ సూచన !
విద్యా దీవెన పథకం నిధులు రూ.686 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. వాటిని పది రోజుల్లో కాలేజీలకు కట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కిందవిడుదల చేస్తున్న విద్యాదీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి విడుదల చేశారు. అక్షరాల 11.03 లక్షల పిల్లల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. మూడో త్రైమాసికం పూర్తయిన వెంనటే నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచ్తేన్నామని.. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ గొప్పగా అమలవుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్న.. ప్రతి వర్గం నుంచి పెద్ద చదువులు చదువుకోవాలన్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత మాత్రమే కాదు.. పిల్లలను వంద శాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మూడో విడతకు సంబంధించి 11.03 లక్షల మంది పేద పిల్లలకు రూ.686 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. మన అందరి ప్రభుత్వం వచ్చాక ఒక్క పూర్తి ఫీజు రియింబర్స్‌మెంటే కాక.. గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించామని జగన్ వివరించారు.
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోండి... ప్రధానికి ముద్రగడ లేఖ !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్‌ను తీసుకు వచ్చారని .. తర్వాత వచ్చిన నాయకులు పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారని విమర్శించారు. కాలేజీలకు ఏళ్లతరబడి బకాయిలు పెట్టారని.. దీనివల్ల కాలేజీల్లో నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వని కారణంగా పిల్లలను కాలేజీలు పరీక్షలు రాయనివ్వని కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయన్నారు. పాదయాత్రలో ఓ ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థి ఉదంతం తనను కలచి వేసిందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేశామని సీఎం జగన్ తెలిపారు.
Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?
అర్హులైన విద్యార్థులందరికీ వందకు వందశాతం పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాంమని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లులకు జమ చేస్తున్నామని.. కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి.. కాలేజీల పరిస్థితులను, వసతులను చూసి ఫీజులు చెల్లించాలని సీఎం సూచించారు. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించాలన్నారు. ఖాతాల్లో జమ అయిన సొమ్మును పది రోజుల్లోపు కాలేజీలకు చెల్లించాలని లేకపోతే.. తర్వాత ఇక కాలేజీలకు కట్టే పరిస్థితి వస్తుందన్నారు. విద్యార్థుల కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్ అయితే కచ్చితంగా యాభై శాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీచేయాలని చట్టం చేశామన్నారు. వీరికి పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తున్నామన్నారు.
Also Read : దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరేవారి శాతం 35.2 శాతానికి పెరిగిందన్నారు. ఇది దేశ సగటు కంటే ఎక్కువన్నారు. అన్ని వర్గాలూ ఉన్నత చదువులు చదువుతున్నాయన్నారు. వసతి దీవెన పథకం కింద ఇప్పటివరకూ రూ.2267 కోట్ల రూపాయలు ఇప్పటివరకూ ఇచ్చామన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, విజయనగరం జిల్లాల్లో జేఎన్డీయూ , ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ తీసుకు వస్తున్నామని జగన్ తెలిపారు.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి