X

AP HighCourt : పేదల ఇళ్ల నిర్మాణాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్లు !

పేదల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. పిటిషనర్లు ... తమ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు మార్గం సుగమం అయింది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పేదలందరికీ ఇళ్ల పథకానికి న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి.  అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలని.. లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. గతంలోనే అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇళ్ల పట్టా కోసం 3 వారాల్లో వినతిపత్రం అందించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వినతిపత్రం ఇచ్చిన 3 నెలల్లో జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది.  దీంతో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోయాయి. 

Also Read : ఏపీకి వరద సాయం చేయండి... రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల విజ్ఞప్తి !

తెనాలికి చెందిన కొంత మంది  పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున స్థలం పేదలకు కేటాయించడం, మహిళలకు మాత్రమే ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి సెంటు, సెంటున్నర స్థలం ఇంటినిర్మాణానికి ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నిస్తూ దీనిపై విచారణ నిర్వహించాలని ఆదేశించారు.  అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులన్నింటినీ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. విచారణలో పిటిషనర్లే వెనక్కి తగ్గారు. 

Also Read : వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?

ప్రభుత్వం 30 లక్షల మందికిపైగా సెంటు సంస్థలను పంపిణీ చేసినట్లుగా ప్రకటించింది. వాటిలో ఇళ్ల నిర్మాణాలకు తొలి విడతగా శంకుస్థాపనలు కూడా చేశారు. కొంత మంది పునాదుల వేసుకున్నారు. చేపట్టిన ఇళ్ల నిర్మాణాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు రావడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. చివరికి కాస్త లేటయినా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది., దీంతో ప్రభుత్వం ఇక ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనుంది. 

Also Read : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు విద్యాదీవెన నిధులు...10 రోజుల్లోగా కాలేజీలకు కట్టాలని సీఎం జగన్ సూచన !

ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. పిటిషనర్లు మీ పార్టీ వారంటే.. మీ పార్టీ వారని ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేయలేక ఇలా నాటకాలు ఆడుతోందని విపక్షాలు విమర్శించారు. ఇప్పుడు మొత్తం క్లియర్ అయినట్లయింది. ఇక ప్రభుత్వం వేగంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. 

Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: ANDHRA PRADESH cm jagan ap high court Construction of poor houses

సంబంధిత కథనాలు

Teachers In Police Stations: పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు.. ఏపీలో రచ్చ రచ్చ..

Teachers In Police Stations: పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు.. ఏపీలో రచ్చ రచ్చ..

Konchada Srinivas: ఆరోగ్య సమస్యలతో నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి

Konchada Srinivas:  ఆరోగ్య సమస్యలతో నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి

Breaking News Live: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో వైసీపీ ఎంపీతో పాటు నటుడు శ్రీకాంత్

Breaking News Live: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో వైసీపీ ఎంపీతో పాటు నటుడు శ్రీకాంత్

Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్

Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ కేంద్రం క్లారిటీ.. చలి తీవ్రత, పొగమంచు పెరిగే ఛాన్స్!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ కేంద్రం క్లారిటీ.. చలి తీవ్రత, పొగమంచు పెరిగే ఛాన్స్!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Rajanna Sircilla: తల్లికి అంత్యక్రియలు చేస్తూ కొట్టుకున్న కొడుకులు.. శవం పక్కనే తగువులాట, ఎందుకంటే..

Rajanna Sircilla: తల్లికి అంత్యక్రియలు చేస్తూ కొట్టుకున్న కొడుకులు.. శవం పక్కనే తగువులాట, ఎందుకంటే..

కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్

కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్

Corona Vaccine: షాకింగ్ అధ్యయనం... టీకా వేసుకున్న ఆరునెలల తరువాత వైరస్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతోంది

Corona Vaccine: షాకింగ్ అధ్యయనం... టీకా వేసుకున్న ఆరునెలల తరువాత వైరస్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతోంది

Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు

Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు