అన్వేషించండి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ లో వరంగల్ జిల్లా మహిళా మావోయిస్టు మృతి

Woman Maoist from Warangal | ఛత్తీస్ గఢ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు.

ఛత్తీస్ గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించింది. ఎన్ కౌంటర్‌లో మృతురాలి గుర్తింపు వివరాలను ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మహిళా మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించినట్లు తెలిపారు. ఆమెది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం కాగా, 35 ఏళ్ల క్రితం పార్టీలో వెళ్లారు. 

ఉన్నత విద్యను అభ్యసించి అజ్ఞాతంలోకి...

LLB పూర్తి చేసిన రేణుక తిరుపతి లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మహిళా సంఘం లో పనిచేస్తూ 1996 లో అజ్ఞాతంలోకి వెళ్లింది. అంచలంచెలుగా ఎదిగిన రేణుక ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటిగా కొనసాగుతుంది. ఉద్యమంలో మొదట ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కొయ్యూరు ఎన్కౌంటర్ మృతి చెందగా. అనంతరం మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరీనీ గా కొనసాగుతూ వచ్చారు. శాఖమూరి అప్పారావు సైతం 2010 జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు.  విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ నంబర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 

మావోయిస్టు ప్రెస్ లో కీలక భూమిక..

రేణుక మావోయిస్టు పార్టీ కి చెందిన అనేక పత్రికల్లో సేవలందిస్తున్నారు. ప్రభాత్, మహిళా మార్గం, ఆవామి జంగ్, పీపుల్స్ మార్చ్ పత్రికల ప్రచురణలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రభాత్ పత్రిక కు సంపాదకురాలిగా  వ్యవహరిస్తున్నారు.

విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం..
రేణుక ఎదవ తరగతి వరకు కడవెండి లో చదువుకుంది. అంతరం రేణుక కుటుంబం మోతుకూరుకు వెళ్ళారు. అక్కడే   ఉంటూ ఉన్నంత విద్యను పూర్తి చేసి, ఎల్ ఎల్ బీ కోసం తిరుపతి వెళ్ళారు. రేణుక తండ్రి సోమయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. రేణుక కు ఇద్దరు సోదరులు, ఒక సోదరుడు గుమ్మడి వెళ్లి రాజశేఖర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మరొక సోదరుడు ఊసెండి పేరుతో మావోయిస్టు పార్టీలో కొనసాగి లొంగిపోయారు. ప్రస్తుతం జర్నలిస్టు గా కొనసాగుతున్నారు.

 ఉద్యమాల ఖిల్లా కడవెండి.
కడవెండి గ్రామం అంటేనే రజాకార్ల గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. అంతేకాదు విప్లవ ఖిల్లా గా పేరుంది. కడవెంది లో ఎటుచూసిన అమ రుల స్థూపాలు కనిపిస్తాయి. రేణుక మరణంతో కడవెండి గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడవెండి గ్రామం నుంచి రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాదులోని బొల్లారం ఉంటున్నట్టు సమాచారం. రేణుక మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఛత్తీస్ ఘడ్ వెళ్తున్నట్టు తెలిసింది. అయితే రేణుక మృత దేహాన్ని కదవెండికి తీసుకువస్తారా లేఖ హైదరాబాద్ తీసుకువెళ్తరా అనేది తెలియాల్సి ఉంది. రేణుక కుటుంబం ఆదర్శ భావాలు గల కుటుంబంగా పేరుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget