Jaabilamma Neeku Antha Kopama OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి ధనుష్ డైరెక్షన్ చేసిన మూవీ తెలుగు వెర్షన్... 'జాబిలమ్మ నీకు అంత కోపమా' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Jaabilamma Neeku Antha Kopama OTT : తమిళ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించిన 'నీక్' మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే టైటిల్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

ధనుష్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 21న 'నీక్' అనే టైటిల్ తో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత తమిళ వెర్షన్ ను మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం.
ఓటీటీలోకి 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించిన 'నీక్' మూవీ తెలుగు వెర్షన్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ముందుగా ఈ మూవీ తమిళ్ వెర్షన్ 'నీక్'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. దీంతో తెలుగు వెర్షన్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం అయోమయంగా మారింది. ఇప్పటిదాకా ఈ విషయం గురించి స్పందించని మేకర్స్ తాజాగా ఒరిజినల్ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ అయిన 10 రోజుల తర్వాత తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ అన్ని భాషల్లోనూ ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయి. కానీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ తమిళ్ వెర్షన్ వేరుగా, తెలుగు వెర్షన్ ను వేరుగా లిస్ట్ చేశారు.
రెండు ఓటీటీలలో 'నీక్' తెలుగు వెర్షన్
ఇదిలా ఉండగా ధనుష్ దర్శకత్వంలో రూపొందిన మూడవ సినిమా 'నీక్'. ఈ మూవీని ఆర్కే ప్రొడక్షన్స్ తో కలిసి ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కాగా ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే కాదు సింప్లీ సౌత్ అనే ఓటీటీలో కూడా తెలుగులో అందుబాటులో ఉండడం విశేషం.
డ్రాగన్ వర్సెస్ నీక్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఈ తమిళ సినిమాలో కయాదు లోహార్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో పాటే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. 'డ్రాగన్' మూవీకి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తే, 'నీక్' మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ దర్శకత్వం వహించడంతో ఈ లవ్ స్టోరీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ 'డ్రాగన్'తో పోటీ పడలేకపోయింది ఈ మూవీ. మార్చి 21న ప్రదీప్ రంగనాథన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టింది. అదే డేట్ కు 'నీక్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

