Raghurama : ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం చేసుకోవాలి.. లోక్‌సభలో రఘురామ విజ్ఞప్తి !
ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తక్షణం ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. లోక్‌సభ జీవో అవర్‌లో ఎంపీ మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని సభ ముందుకు తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రధానమంత్రి జోక్యం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రే కాదని.. బ్యాంకులు కూడా మునిగిపోతాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న 'జవాద్' సైక్లోన్ .. ఎక్కడుందో లైవ్ చూడండి!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పులు విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ చట్టం .. ఎఫ్‌ఆర్‌బీఎం నియంత్రణలు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని రఘురామ లోక్‌సభలో తెలిపారు. రాష్ర్ర్ట ప్రభుత్వం రాజ్యాంగం లోని 293 నిబంధనను ఉల్లంఘిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీ అఫ్పులు 7 లక్షల కోట్లకు చేరాయని, మరో లక్ష కోట్లు అప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రఘురామ లోక్ సభ దృష్టికి తెచ్చారు. ఇప్పుడు మేలుకోకపోతే రాష్ట్రం , బ్యాంకులు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Sirivennela Live: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..
ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలను ఉల్లంఘించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని రఘురామ కోరుతున్నారు. రాష్ట్రాలు చట్టాలను ఉల్లంఘించకుండా చట్టం చేయాలని సూచించారు. రఘురామరాజు ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ధాన్యం సేకరణ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులతో నిరసన తెలియచేస్తున్నారు. ఆ సమయంలోనూ రఘురామ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Also Read: AP Govt OTS : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామ తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే కేంద్రంలోని వివిధ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నాయి. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయంలో ఆర్బీఐ ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రఘు రామ రాజు లేవెనత్తిన అంశాలపై కేంద్రం వివరణ ఇస్తే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?