AP Cabinet : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనపై చర్చ జరుగుతోంది. రెండున్నరేళ్లకు అందర్నీ తీసేసి కొత్త వారిని తీసుకుంటానని జగన్ మొదట్లోనే చెప్పడం దీనికి కారణం. ఇప్పుడు జగన్ మనసు మార్చుకున్నారా ? కేబినెట్ మార్చేస్తారా ?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం రెండున్నరేళ్ల పూర్తయింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మంత్రివర్గ సహచరులందరికీ ఓ మాట చెప్పారు. అదేమిటంటే... మీ పదవి కాలం రెండున్నరేళ్లు మాత్రమే. ఆ తర్వాత 90 శాతం మందిని మార్చేస్తామని చెప్పారు. ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తయింది. దీంతో అందరిలోనూ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు అనే చర్చ ఊపందుకుంది. మంత్రులు ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు అదే అడుగుతున్నారు. వారు కూడా అంతా ముఖ్యమంత్రి ఇష్టం అని చెబుతున్నారు. మరి జగన్ ఏమనుకుంటున్నారు ?
Also Read : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?
మంత్రివర్గ ప్రక్షాళనపై అందని సంకేతాలు !
కొద్ది రోజుల కిందట మంత్రి వర్గ సమావేశంలోనే జగన్ కేబినెట్ ప్రక్షాళన గురించి చెప్పారు. వంద శాతం మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందు ప్రకటించారు. అప్పుడే కేబినెట్ ప్రక్షాళనపై జగన్ స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని అందరికీ అర్థమైంది. కానీ ఇప్పుడు కసరత్తు ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికైతే మంత్రివర్గ ప్రక్షాళనపై ఎలాంటి సమాచారం పార్టీ నేతలకు అందడం లేదు.
Also Read : హోదా ముగిసిన అధ్యాయం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చేసిన కేంద్రం !
పదవుల్ని కాపాడుకునేందుకు కొందరు.. పొందేందుకు కొందరు ప్రయత్నాలు !
నలుగురు ఐదుగురు మంత్రులు వివాదాల్లో ఇరుక్కున్న వారిని పక్కన పెడితే హైకమాండ్ ఏది చెబితే అది చేయడానికి వెనుకాడని వీర విధేయ మంత్రులు ఉన్నారు. అలాగే సీనియర్లను కూడా పక్కన పెట్టలేని పరిస్థితి. అలా అని కొంత మందిని ఉంచి కొంత మందిని తొలగిస్తే అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ సమీకరణాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి సీఎం జగన్ కొంత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవుల్ని నిలబెట్టుకోవడానికి .. కొత్తగా టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎంపై కురిసిన పొగడ్తల జల్లు వెనుక ఈ కేబినెట్ ప్రక్షాళన సమీకరణాలు ఉన్నాయని భావిస్తున్నారు.
కేబినెట్ నుంచి తప్పించే సీనియర్లకు ప్రాంతీయ అభివృద్ది మండళ్ల పదవులు ?
మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమని సీనియర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. పెద్దిరెడ్డి, బొత్స వంటి వారిని కేబినెట్ నుంచి తప్పించి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసివారికి బాధ్యతలిస్తారని అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, రాజమండ్రి కేంద్రంగా గోదావరి, కష్ణా జిల్లాలు, ఒంగోలు కేంద్రంగా దక్షిణ కోస్తా జిల్లాలు, కర్నూలు కేంద్రంగా రాయలసీమ ప్రాంతీయ అభివద్ధి మండళ్లను ఏర్పాటు చేసి.. సీనియర్లకు పదవులు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ పనులను క్షేత్ర స్థాయిలో వారు చూసుకుంటారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : ఏపీకి వరద సాయం చేయండి... రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల విజ్ఞప్తి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి