Mumbai Indians Retained Players 2025 | హిట్ మ్యాన్ ఉన్నాడు..హిట్ మ్యాన్ ఉంటాడు | ABP Desam
అవమానాలు ఎదురైనంత మాత్రాన బాహుబలి మాహిష్మతిని వదిలి వెళ్లిపోతాడా. ఊరి పొలిమేరల్లో ఉండే రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఇది కూడా అంతే కెప్టెన్సీ తీసేశారు. ఐదు సార్లు కప్పుతెచ్చి చేతిలో పెట్టినవాడిని అవమానించారు. అయినా కానీ మన బాహుబలి రోహిత్ శర్మ మాత్రం ముంబైని వదిలిపోలేదు. ముంబై కూడా వదులుకోలేదు. మనస్పర్థలు తాత్కాలికం..కానీ ముంబై ఇండియన్స్ శాశ్వతం అనుకున్నాడేమో ఏమో మేరునగవు అంతటి మనిషి వేరే వాడి కెప్టెన్సీలో ఆడటానికి ఒప్పుకున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ముంబై రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో రోహిత్ శర్మ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పదహారు కోట్ల 30లక్షల రూపాయలకు హిట్ మ్యాన్ ను రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇక పేస్ పాశుపత్రాస్త్రం జస్ ప్రీత్ బుమ్రా కోసం ముంబై అత్యధికంగా 18కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ కోసం చెరో 16కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయించింది ముంబై ఇండియన్స్. వీళ్లిద్దరికి రోహిత్ శర్మ కంటే ఐదులక్షలు ఎక్కువే ముట్టాయి. ఇక హైదరాబాదీ తిలక్ వర్మ కోసం 8కోట్లు అమౌంట్ కేటాయించి రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. సో మొత్తం 75కోట్లు ఈ ఐదుగురు ప్లేయర్లకు కేటాయించుకున్న ముంబై..మిగిలిన 45కోట్ల రూపాయలతో ఆక్షన్ కి వెళ్తోంది.