అన్వేషించండి

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు

Andhra Pradesh: అదానితో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని షర్మిల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మోదీ, అదానీలకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

YS Sharmila On Jagan: జగన్ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని షర్మిల గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.  ఈ డీల్ ను రద్దు చేయాలని .. దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరామన్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం..లాభం అధానికి ..  అదానీ కి లాభం కోసమే ఈ డీల్. ఈ డీల్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు.  రాబోయే 25 ఏళ్లు ఈ డీల్ అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనన్నారు.  ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు..కానీ అదానీ కి లాభం కావాలని.. ఇదే సెకి తో గుజరాత్ 1.99 పైసలకు ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.  కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2.49 పైసలు చేసుకుందని.. ఇతర ఖర్చులతో కలిపి మొత్తంగా యూనిట్ కి 5 రూపాయలు పడుతుందన్నారు.  ఈ డీల్ వల్ల లక్షల కోట్ల భారం పడుతుందని.. ఇలాంటి ముడుపుల డీల్స్ వల్ల ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!

ఇప్పటికే 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు ప్రజలపై మోపారన్నారు.  ఇంత జరిగినా రాష్ట్రం కానీ,కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని..  ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నామన్నారు.  మన దేశంలో జరిగిన అవినీతి అమెరికా లో బయట పడింది. ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో ఉన్నాయన్నారు. అన్ని వ్యవస్థలను అదానీ గుప్పెట్లో పెట్టుకున్నారు. అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇది సిగ్గుచేటు అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  వీళ్ళ అవినీతి గురించి ప్రపంచం చర్చ చేస్తుందని..  అదానీ దేశం పరువు తీశాడు..జగన్ రాష్ట్రం పరువు తీశాడని మండిపడ్డారు. 

అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయి.. అరెస్టు లకు సిద్ధం అవుతున్నారు కానీ మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదుఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని .. అదానీ, మోడీకి చంద్రబాబు బయపడుతున్నారని విమర్శించారు.  అదానీ పేరు కూడా ఉచ్చరించడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు లేదన్నారు. డీల్ రద్దు కు కూటమి ప్రభుత్వం వెనక అడుగు వేస్తుందిఈ అక్రమ డీల్ తో ప్రజలు భారం మోయాలా ? గతంలో ఈ డీల్ పై టీడీపీ ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. PAC ఛైర్మన్ పయ్యావుల ఇది భారీ కుంభకోణం అన్నారు. 1.99 పైసలు కొనే విద్యుత్ ను 2.45 పైసలు పెట్టీ ఎలా కొన్నారు అని ప్రశ్నించారు కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారన్నారు.  

Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే

జగన్ ఆంధ్రను బ్లాంక్ చెక్ లా రాసి ఇచ్చాడు ఇదంతా తెలిసి ఎందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు.  కేంద్రంలో JPC వేయాలని..  జగన్ ముడుపులు తీసుకున్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయని..  అదానీ తో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయి.. అదానీ కలిసిన వెంటనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.  ఈ డీల్ లో అదానీ కాకపోతే ఎప్పుడో చర్యలు ఉండేవి ..  అదానీ ఉన్నాడని ఎవరు నోరు విప్పడం లేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Embed widget