Long Distance Mileage Bikes: రోజూ లాంగ్ రైడ్ చేసే పొడవైన వ్యక్తులకు మైలేజ్ & కంఫర్ట్ ఇచ్చే బైక్‌లు - నిపుణుల సూచనలు ఇవే!
రోజుకి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఆరు అడుగుల పొడవైన వారికి మైలేజ్, కంఫర్ట్ కలిగిన బెస్ట్ బైక్‌లు ఏవో తెలుసుకోండి. 150cc-200cc బైక్ ఆప్షన్‌లు ఇవే.

Best Commute Bikes For Daily 150 Km Ride: రోజుకు 150 కిలోమీటర్ల వరకు బైక్ రైడ్ చేయడం అంటే సరదా అయిన విషయం కాదు. కానీ, ఉపాధి కోసం అంతంత దూరం తిరగాల్సిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే, అలాంటి దీర్ఘమైన రోజువారీ ప్రయాణం చేసే వాళ్లు బైక్ సెలక్షన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందునా, దాదాపు ఆరు అరుగుల ఎత్తైన వ్యక్తులకు ఇలాంటి లాంగ్ రైడ్స్‌లో బైక్ సీటింగ్ కూడా కంఫర్ట్‌గా ఉండాలి. కొంచం ఎక్కువ పవర్‌ఫుల్, కంఫర్ట్‌తో పాటు మైలేజ్ కూడా తగ్గకుండా ఉండాలి కదా?.
లాంగ్ రైడింగ్‌కు సరిపోయే కొన్ని స్మార్ట్ బైక్స్
Bajaj Pulsar N160
మీరు ఇప్పటికే ఒక బైక్ వాడుతుంటే, బజాజ్ పల్సర్ N160 ఒక అద్భుతమైన అప్‌గ్రేడ్ అవుతుంది. సిటీ రైడ్‌కైనా, హైవే రన్‌కైనా ఈ ఇంజిన్ సరిపోతుంది. సాఫ్ట్ సీటింగ్, కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్, లీటరుకు 40+ km మైలేజ్‌తో రోజువారీ 150 km దూరాన్ని సులభంగా తిరిగొస్తుంది.
TVS Apache RTR 160 4V
యంగ్ రైడర్లలో చాలా పాపులర్ బైక్ ఇది. పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన కంఫర్ట్, LED హెడ్‌ల్యాంప్స్, స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, మరికొన్ని స్మార్ట్ ఫీచర్లు కలిసి ఈ బైక్‌ని ఫుల్ మీల్ ప్యాకేజ్‌గా మార్చాయి.
Honda SP160 / Unicorn
ఆరు అడుగుల వరకు ఎత్తు ఉన్న వ్యక్తులు సింపుల్‌గా, కంఫర్ట్‌గా రైడ్ చేయాలనుకుంటే.. హోండా బైక్‌లు బెస్ట్. తక్కువ వైబ్రేషన్స్, మెత్తని సీటింగ్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ - ఇవన్నీ లాంగ్ డిస్టెన్స్ రైడ్స్‌కి సరైన కాంబోగా నిలుస్తాయి.
Suzuki Gixxer
ఈ బైక్ డిజైన్ స్పోర్టీగా ఉండి, పొడవైన రైడర్లకు పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. హైవేలో స్థిరంగా & వేగంగా ఉంటుంది, సీటింగ్ పొజిషన్ కూడా 6 అడుగుల రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది.
Yamaha FZ Series
మైలేజ్, స్టైల్, కంఫర్ట్ అన్నీ కలిపి ఒకే బైక్ కావాలంటే ఇది పూర్తిగా ఫిట్. దీని బాడీని లాంగ్ రైడ్స్‌కి సరిగ్గా బ్యాలెన్స్ అయేలా రూపొందించారు.
ఇంకా కొంచెం పవర్ కావాలా?
మీకు, వీటికంటే మరింత శక్తిమంతమైన బైక్స్ కావాలంటే... TVS Apache RTR 200 4V, Honda Hornet 2.0 లేదా Bajaj Pulsar NS200 వైపు చూడండి. ఇవి సూపర్ కంఫర్ట్ రైడ్స్ కావడంతో పాటు, వేగం & రోడ్ హ్యాండ్లింగ్‌లో కూడా అద్భుతంగా ఉంటాయి.
ఏ బైక్ అయినా తీసుకునే ముందు తప్పనిసరిగా లాంగ్ టెస్ట్ రైడ్ చేయండి. సీటింగ్ కంఫర్ట్, హ్యాండిల్ రీచ్, రైడింగ్ పొజిషన్ అన్నీ చెక్ చేసుకోండి. చివరగా, మీ బడ్జెట్, మైలేజ్, రైడ్ కంఫర్ట్ - ఈ మూటింటినీ బ్యాలెన్స్ చేస్తూ సరైన బైక్ ఎంచుకోండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















