IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
ఐపీఎల్ 2026 కి సంబంధించి చర్చలు జోరందుకున్నాయి. ట్రేడ్ డీల్స్, రేటెన్షన్ అంటూ మళ్ళి సందడి మొదలయింది. అయితే ఈ ట్రేడ్ డీల్ లో బాగా వినిపిస్తున్న పేరు సంజు శాంసన్. సంజు శాంసన్ RR నుంచి తప్పుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దాంతో సంజును దక్కించుకోవడానికి CSK చాలా ప్రయత్నిస్తుందని కూడా ఊహాగానాలు వినిపించాయి.
ఇలాంటి సమయంలో మరో వార్త వైరల్ అవుతుంది. అది ఏంటంటే సంజూ శాంసన్ CSK లో జాయిన్ అవడం దాదాపు ఖాయంగా అయిపోయిందట. నివేదికల ప్రకారం, సంజు శాంసన్ స్థానంలో CSK టీమ్ నుంచి రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్ ను RRతో ట్రేడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ట్రేడ్ నిజమైతే జడేజా 17 సంవత్సరాల తర్వాత RR టీమ్ లోకి వస్తాడు.
సంజున్ శాంసన్ రాజస్థాన్ టీమ్ తరపున 11 సంవత్సరాలు ఆడాడు. అలాగే జడేజా CSK తో 12 సీజన్ల నుంచి ఉన్నాడు. క్రికెట్ విశ్లేషకులు ఊహిస్తునట్టుగా ఈ ట్రేడ్ జరుగుతే... ఎంతో మంది CSK ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవడం ఖాయం.





















