This Week Telugu Movies : దుల్కర్ 'కాంత' To క్రైమ్ థ్రిల్లర్ 'Cమంతం' వరకూ... - ఒకే రోజు 5 సినిమాలు... ఈ వారం థియేటర్, ఓటీటీ మూవీస్ లిస్ట్
Upcoming Telugu Movies : ఈ వారం చిన్న సినిమాల నుంచి రీ రిలీజ్‌ల వరకూ మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకే రోజు 5 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Upcoming Telugu Movies In Theaters OTT Releases In November Second Week : ఈ వారం చిన్న సినిమాల దగ్గర నుంచి ఒకప్పటి బిగ్గెస్ట్ హిట్ 'శివ' రీ రిలీజ్ వరకూ కొత్త మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. దీంతో పాటే ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...
దుల్కర్ 'కాంత'
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ డ్రామా 'కాంత'. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా... రానా కీలక పాత్ర పోషించారు. 1950 కాలం నాటి మద్రాస్ ఇండస్ట్రీ పరిస్థితులను ప్రతిబింబిస్తూ... ఓ స్టార్ హీరో, డైరెక్టర్ మధ్య జరిగిన కథను ఇందులో చూపించారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రైమ్ థ్రిల్లర్ 'Cమంతం'
డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'Cమంతం' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో వజ్రయోగి హీరోగా నటించగా శ్రేయభర్తీ హీరోయిన్‌గా నటించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించగా... ప్రశాంత్ టాటా నిర్మించారు. గర్భిణుల నేపథ్యంలో సాగే స్టోరీ ఆసక్తికరంగా ఉంటుందని మూవీ టీం వెల్లడించింది.
కామెడీ ఎంటర్టైనర్ 'జిగ్రీస్'
రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'జిగ్రీస్'. హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ వోడపల్లి నిర్మించారు. తమ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని... దీంతో పాటు ఎమోషనల్ అంశాలు ఆడియన్స్ మనసులు టచ్ చేస్తాయని చెప్పారు.
వెరైటీ కథతో 'సంతాన ప్రాప్తిరస్తు'
ప్రస్తుత జనరేషన్ ఎదుర్కొంటున్న సంతాన లేమి సమస్య బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కించిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
నాగార్జున 'శివ' రీ రిలీజ్
స్టార్ హీరో నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ 'శివ'. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 1989లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 4కే డాల్బీ అట్మాస్ వెర్షన్‌లో ఈ నెల 14న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
'దే దే ప్యార్ దే 2'
ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే కథాంశంతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'దే దే ప్యార్ దే 2' రాబోతోంది. 2019లో వచ్చిన 'దే దే ప్యార్ దే' చిత్రానికి సీక్వెల్ కాగా... అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీల్లో మూవీస్ / వెబ్ సిరీస్ లిస్ట్
నెట్ ఫ్లిక్స్ - మెరైన్స్ (వెబ్ సిరీస్), ఢిల్లీ క్రైమ్ 3 (హిందీ వెబ్ సిరీస్ - నవంబర్ 13), తెలుసు కదా (నవంబర్ 14), డ్యూడ్ (నవంబర్ 14), బైసన్ (నవంబర్ 14).
అమెజాన్ ప్రైమ్ వీడియో - ప్లే డేట్ (మూవీ - నవంబర్ 12)
జీ5 - ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్ - నవంబర్ 14)
జియో హాట్ స్టార్ - జాలీ ఎల్ఎల్‌బీ (హిందీ - నవంబర్ 14)
ఆహా - కె ర్యాంప్ (నవంబర్ 14)
మనోరమ మ్యాక్స్ - కప్లింగ్ (మలయాళం - నవంబర్ 14)




















