Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా... ఇంగ్లాండ్‌ను 2 రోజుల్లోనే ఓడించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పది వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీతో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ 35 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో హెడ్‌ను ఓపెనర్‌గా వచ్చాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసాడు. వచ్చిన బాల్ వచ్చినట్టుగా బౌండరీలకు చేర్చాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు. దాంతో 205 పరుగుల టార్గెట్ ని ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో ఛేజ్ చేసి మ్యాచ్‌ను ముగించింది. టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో 70 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేయలేదు. తన సెంచరీతో ట్రావిస్ హెడ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.





















