Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీల సమక్షంలో కూతురు పెళ్లి జరిపిన రాజ్ మంతెన.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యారు. బెజవాడ మూలాలున్న ఈ రాజుగారు.. అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు..?

Raj Matena: ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఓ భారీ వివాహానికి వేదికైంది. అక్కడ జరిగేవన్నీ పెద్ద పెళ్లిళ్లే కాబట్టి అది పెద్ద విషయం కాదు. కానీ ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు కొడుకు డోనాల్డ్ ట్రంప్ జూనియర్, హాలీవుడ్ సెలబ్రిటీ జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ అెటండ్ అయ్యారు. ఇండియాలోని బడా బిజినెస్ మ్యాన్‌లు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ పెర్‌ఫార్మర్లతో రెండు రోజుల పాటు కల్యాణ వేదిక కళకళలాడింది. దీంతో ఇంత గ్రాండ్‌గా పెళ్లి చేస్తున్న ఈ బిజినెస్ టైకూన్ ఎవరూ అని ఇండియా మొత్తం ఆరా తీస్తోంది. కుమార్తె పెళ్లిని ఇంత గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ఆ వ్యక్తి రామరాజు మంతెన… యుఎస్‌లో Raj మంతెన అంటారు. బెజవాడకు చెందిన బిజినెస్‌మ్యాన్
అమెరికాలో టాప్ ఫార్మా బిజినెస్ టైకూన్ అయిన రామరాజు మంతెన తన కుమార్తె నేత్రా మంతెన వివాహాన్ని వంశీ గాదిరాజుతో జరిపిస్తున్నారు. ఇండియాలో భారీ వివాహాల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ అయిన ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో మూడు రోజుల వేడుకలు జరిగాయి. 21న ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్, 22 న హల్దీ, 23 ఆదివారం వివాహం జరుగుతున్నాయి. సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.
View this post on Instagram
ఎవరీ రాజ్ మంతెన (Who is Raj Manthena)
రామరాజు మంతెన విజయవాడలో పుట్టి పెరిగారు. JNTU కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన ఆయన ఆ తర్వాత యుఎస్‌కు వెళ్లారు. అక్కడ మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ ఫార్మాలజీ డిగ్రీ చేశారు. యు.ఎస్‌లో ఫార్మా ఇండస్ట్రీ ప్రారంభించారు. ఆయన ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే Ingenus Pharmaceuticals కు వ్యవస్థాపక ఛైర్మన్, సీఈవో. 1984లో యుఎస్‌కు వెళ్లిన తర్వాత ఆయన మొత్తం 7 ఫార్మా కంపెనీలు స్థాపించారు. ముఖ్యంగా వైద్య పరమైన పరిశోధక కంపెనీలు ఉన్నాయి. జెనరిక్ మెడిసన్, క్యాన్సర్ మందులను ఆయన కంపెనీలు తయారు చేస్తుంటాయి. యుఎస్‌తో పాటు, స్విట్జర్లాండ్, ఇండియాలో కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా Integra అనే సంస్థను స్థాపించారు. ఇది ఇప్పుడు బాగా ప్రాచర్యంలోకి వస్తున్న Precision Meidcine రంగంలో పరిశోధనలు చేస్తుంది.

గోకరాజుకు బంధువు
రాజ్ మంతెన ఏపీలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తే. మాజీ బీజేపీ ఎంపి, ఆంధ్రా క్రికెట్ అసోసియేష్ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవెత్త గోకరాజు గంగరాజుకు మేనల్లుడే రామరాజు మంతెన. ఆ తర్వాత ఆయన గంగరాజు కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఈ రకంగా రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు ఆయన దగ్గరే. మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత కనుమూరి బాపిరాజు, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజులకు కూడా బంధువే అవుతారు.
ట్రంప్ కుటుంబానికి సన్నిహితం..
రాజ్ మంతెన యుఎస్‌లోని తన ఫార్మా, ఐటీ కంపెనీలను విక్రయించడం ద్వారా భారీగా ఆర్జించారు. ఈ సంస్థలను విక్రయించే క్రమంలో అమెరికాలోని భారీ పారిశ్రామికవేత్తలతో ఆయనకు పరిచయాలు బలపడ్డాయి. అంతేకాదు. యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉంది. ఫ్లోరిడాలో ట్రంప్, రాజ్‌మంతెన కుటుంబాలు పక్క పక్కనే ఉండేవి. ఆ రకంగా ఈ వీరికి సాన్నిహిత్యం ఉంది. అందుకే రాజ్‌మంతెన కుమార్తె పెళ్లికి జూనియర్ ట్రంప్ విచ్చేశారు. ఈ మధ్యనే ఆయన ఫ్లోరిడాలో 400 కోట్ల విలువ చేసే 16 బెడ్‌రూమ్ ఫ్లాట్ కొన్నారని మీడియా రిపోర్ట్స్ వచ్చాయి.

నేత్రా రాజు- వంశీ గాదిరాజు
భారీ వేడుక ద్వారా ఒక్కటవుతున్న నేత్ర, వంశీ కూడా ఒకరికొకరు తెలిసిన కుటుంబాల వారే. నేత్రా ఫార్మకాలజీలో డిగ్రీ చేసి.. న్యూయార్క్‌లో జాబ్ కూడా చేస్తున్నారు. వంశీ గాదిరాజు తెలుగు మూలాలున్న అమెరికన్. అతను శాన్‌ఫ్రాసిస్కోలోని బే ఏరియాలో చిన్నప్పటి నుంచి పెరిగారు. . కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వంశీ.. Super Order అనే స్టార్టప్ ను స్థాపించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాల్లో ఉత్తమ ఆవిష్కరణగా అది నిలిచింది. Forbs అతన్ని యుఎస్‌లో 30 అండర్ 30 లిస్ట్‌లో గుర్తించింది.

భారీ గా నిర్వహిస్తున్న వివాహ వేడుక
ఈ పెళ్లివేడుకను నవంబర్ 21,22,23 వ తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి వేడుకలు ఒక్క చోట కాదు.. మూడు చోట్ల జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో హల్దీ వేడుక జరిగితే. Jag Mandir Island Palace లో వివాహ వేడుక జరుపుతన్నారు. ఇది కాకుండా Zeenana Mahal, City Palace on Lake Pichola వంటి చోట్ల కూడా వివిధ వేడుకలు జరిగాయి. వివాహ వేడుక మొత్తం రెడ్ థీమ్‌లో చేశారు. మెహందీ, హల్దీ, సంగీత్ వంటివి అత్యంత వైభవంగా జరిగాయి.. సంగీత్ కు దియా మిర్జా యాంకరింగ్ చేయగా.. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ , మాధూరి దీక్షిత్, జాక్వెలిన్, నోరా ఫతేహీ వంటి వారంతా డాన్సులు చేశారు. కరణ్‌జోహర్ వధూవరులతో కాఫీ విత్ కరణ్ షో ప్యాలెస్‌లో నిర్వహించాడు. రణ్‌వీర్ సింగ్ జూనియర్ ట్రంప్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌లతో డాన్సులు చేయించాడు.. అసలు ఇప్పటి వరకూ జరగనంత గ్రాండ్ రేంజ్‌లో వివాహ వేడుక జరిగిందని చెప్పుకుంటున్నారు





















