Ramana Gogula : ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
Ramana Gogula Music Journey : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల సరికొత్తగా 'ట్రావెలింగ్ సోల్జర్' పేరుతో మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. విశ్వవేదికలపై తెలుగు పాటలను ప్రెజెంట్ చేయనున్నారు.

Musical Director Ramana Gogula New Global Musical Journey : ఒకప్పుడు యూత్ ట్రెండ్‌కు అనుగుణంగా పాటలు కంపోజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని సంగీతాన్ని అందించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, జానీ, లక్ష్మీ, అన్నవరం వంటి మూవీస్‌కు ఆయన బీజీఎం వేరే లెవల్. దాదాపు పదేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఆయన... ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం'లో 'గోదారి గట్టుమీద రామ సిలకవే' సాంగ్‌తో అలరించారు.
ట్రావెలింగ్ సోల్జర్... న్యూ ఎమోషనల్ జర్నీ
రమణ గోగుల ఇప్పుడు కొత్తగా 'ట్రావెలింగ్ సోల్జర్' పేరుతో సరికొత్త మ్యూజిగ్ జర్నీని ప్రారంభించారు. భుజాన గిటార్‌తో పాటను పరుగులెత్తించి... ఒక తరాన్నే ఇన్ స్పైర్ చేసి... నిన్నటి జ్ఞాపకాలను... రేపటి ప్రపంచ వేదికపై నిలిపేందుకే ఈ జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'ఇది కేవలం పాటల ప్రవాహం మాత్రమే కాదు. భావోద్వేగాల ప్రయాణం' అని తెలిపారు. ఈ గ్లోబల్ టూర్ ఆస్ట్రేలియా నుంచి ప్రారంభం కాబోతోంది.
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో రమణ గోగులతో పాటు ఎక్సెల్ గ్లోబల్ సర్వీస్ ఎండీ రామ్, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ... ఈ వరల్డ్ టూర్ వివరాలు వెల్లడించారు. విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండా ఎగురవేయనున్నారు. మామా క్రియేటివ్ స్పేస్ (Melbourne MAMA Creative Space), టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా (Top Notch Entertainment Australia) సంయుక్తంగా ఈ మ్యూజిక్ జర్నీని ప్రకటించాయి. ఈ టూర్ కేవలం మ్యూజిక్ కన్సర్ట్స్‌కు మాత్రమే కాకుండా... రమణ గోగుల ఐకానిక్ సాంగ్స్, వాటి వెనుక జ్ఞాపకాలు, తెర వెనుక స్టోరీస్, ఎమోషనల్ జర్నీ అని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన 'డాక్యు-మ్యూజికల్ సిరీస్'ను రూపొందిస్తోంది.
Also Read : అనిల్ రావిపూడికి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్ - బర్త్ డేకు విషెష్‌తో పాటే మరో స్పెషల్
ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఈ ప్రాజెక్టులో భాగంగా ఏళ్ల తర్వాత రమణ గోగుల విశ్వ వేదికలపైకి రావడం, హిట్ సాంగ్స్ వెనుక స్టోరీస్, సరదా సంభాషణలు, అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల్లో ఆయన జర్నీ ఎక్స్ పీరియన్స్ వంటివి ఉంటాయి. ఈ మ్యూజికల్ జర్నీని డాక్యుమెంటరీ 'ఇండో ఆస్ట్రేలియన్ మ్యూజికల్' జర్నీగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టూర్ కోసం టీం అందరికీ ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ ఎండీ రామ్ కట్టాల వీసాలు అందించారు. ఈ సందర్భంగా టీం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
షెడ్యూల్ వివరాలు...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ప్రపంచ యాత్ర ప్రారంభం అవుతుంది.
- ఆస్ట్రేలియా ఫిబ్రవరి 2026 - మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్
- యూకే (2026) - లండన్, మాంచెస్టర్ (ప్లానింగ్‌లో ఉంది)
- అమెరికా (2026) - ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్లానింగ్‌లో ఉంది). ఈ మ్యూజికల్ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుంది.
View this post on Instagram





















