పవన్ కళ్యాణ్ సినిమాకి రమణ గోగుల గుండుకి లింకేంటి!

రమణ గోగుల ఈ పేరు వినగానే నున్నటి గుండుతో ఉన్న ఫేస్ గుర్తొస్తుంది.. ఆయనెప్పుడూ అలా ఎందుకు ఉంటారు?

గోగుల కావాలనే గుండుతో ఉంటారా లేదంటే జుట్టు పెరగదా అనే సరదా సందేహం చాలామందిలో ఉంది

వెంకీ-అనిల్ రావిపూడి లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్ తో లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు రమణ గోగుల

గోదారి గట్టుమీద రామచిలుకవే సాంగ్ గురించి మీడియాతో మాట్లాడూతూ తన గుండు గురించి చెప్పుకొచ్చారు

పవన్ కళ్యాణ్ జానీ సినిమా టైమ్ లో రమణ గోగుల భార్య గర్భవతి..ఆ టైమ్ లో డెలివరీ కష్టమని డాక్టర్స్ చెప్పారట

ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఆఫీసులో టెన్షన్ గా కూర్చున్న టైమ్ లో..తిరుపతి వెళ్లిరండి సర్ అని కీబోర్డ్ ప్లేయర్ సలహా ఇచ్చాడట

తిరుమల వెళ్లి శ్రీవారికి తలనీలాలు ఇచ్చి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యా లేకుండా ఆమెకు నార్మల్ డెలివరీ అయిందట

అప్పటి నుంచి ఇక జుట్టు పెంచుకోకూడదని డిసైడ్ అయ్యాడట రమణ గోగుల...

భార్యంటే మీకు ఎంత ప్రేమ సర్ అంటూ రమణ గోగుల గుండు స్టోరీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు