'డాకు మహారాజ్' లో 'భగవంత్ కేసరి' సెంటిమెంట్ రిపీట్!
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'డాకు మహారాజ్'
ప్రగ్యా జైశ్వాల్ , శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోంది
ప్రచారంలో వేగం పెంచిన టీమ్ ఈ మూవీ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజ్ చేసింది...
నా బంగారు కూన, చిన్నారి కూన అని సాగే ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా తమన్ స్వరాలు సమకూర్చాడు..
డాకూ మహరాజ్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.. యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ వస్తోన్నా ఇందులో సెంటిమెంట్ మస్త్ ఉన్నట్టే ఉంది
భగవంత్ కేసరి మూవీలో తాను పెంచిన చిన్నారిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొనే చిచ్చాగా బాలకృష్ణ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయ్
చిన్నారి కూన సాంగ్ లో చిన్నారితో బాలయ్య ఆటపాటలు చూస్తుంటే ఇది కూడా పాప సెంటిమెంట్ తో సాగబోతోందని అర్థమవుతోంది
బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆదే 100 దేవుళ్ళ లెక్క అనే డైలాగ్ భగవంత్ కేసరిలో బాగా పేలింది..
ఇప్పుడు డాకూ మహారాజ్ లోనూ అంతే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది