Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
నర్మదా మ్యాన్.. ఈ ఒక్క పేరు ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఇప్పటివరకు వరల్డ్ టాప్ సైంటిస్టులు కూడా కనిపెట్టలేని ఓ అన్‌సాల్వ్డ్ మిస్టరీని ప్రపంచం మందుంచింది. ప్రపంచం నుంచి భారత్ పుట్టలేదని.. భారతదేశమే ప్రపంచం మొత్తానికి మూలమనే మన ప్రాచీన గంధాల్లోని వాదనని దాదాపు నిజం అనేటంతలా ప్రూవ్ చేసింది. అయితే అసలెవరీ నర్మదా మ్యాన్? నర్మదా నది ఒడ్డున దొరికిన ఆ పుర్రె వెనక దాగున్న రహస్యం ఏంటి? పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో తెలుసుకుందాం.
నర్మదా మ్యాన్" మధ్య, చివరి ప్లీస్టోసీన్ కాలంలో భారతదేశంలో నివసించిన ఒక అంతరించిపోయిన మానవ జాతికి సంబంధించిన అవశేషం. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున శాస్త్రవేత్తలకి ఓ పుర్రె దొరికింది. ఆ పుర్రెకే నర్మదా మ్యాన్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఆ పుర్రె మొత్తం భారత చరిత్రకి సంబంధించి అప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన హిస్టరీనే దాదాపు మార్చేసింది.





















