రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెండితెరపైన మాత్రమే తుపాకీలతో తూటాల వర్షం కురిపించడం చూసుంటారు. కానీ.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో నిజంగానే ఓజీ రేంజ్‌లో తుపాకీ గురి పెట్టి తూటాలు పేల్చాడు మన ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయన ఫ్యాన్స్ అంతా పవన్ కల్యాణ్‌ని రియల్ ఓజీ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే తాడేపల్లిలోని నులకపేటలో ఉన్న ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఏరియాలో ఆదివారం నాడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
ఈ క్రమంలోనే అక్కడున్న ఫైరింగ్ రేంజ్‌లో అధికారులతో మాట్లాడారు. గన్స్ ఎలా ఉపయోగించాలి? వాటిలోని టెక్నికాలిటీస్ ఏంటి? అనే విషయాలపై ఆఫీసర్లని అడిగి తెలుసులకున్నారు. దీనిపై పవన్ ఓ స్పెషల్ ట్వీట్‌ని కూడా షేర్ చేశారు. అందులో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయిన నేను.. నా గ్లోక్ 0.45 పిస్టల్‌తో కొన్ని రౌండ్లు ఫైర్ చేసి షూటింగ్ ప్రాక్టీస్ చేశాను. వెపన్ ఎలా మెయింటెయిన్ చేసుకోవాలో అక్కడి ఆఫీసర్లని అడిగి తెలుసుకున్నాను. ఈ ప్రాక్టీస్ సెషన్ తర్వాత నాకు చిన్నప్పుడు మద్రాస్ రైఫిల్ క్లబర్ మెంబర్‌గా షూటింగ్ ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తొచ్చాయి. అని పవన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.





















