అన్వేషించండి

CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా

Andhra Pradesh News | పార్టీ సభ్యత్వ నమోదుపై తొలి పది స్థానాల్లో నిలిచిన టీడీపీ నేతలతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ నమోదు చేయించిన నారా లోకేష్ ను పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు.

TDP Membership Program | అమరావతి: టీడీపీ సభ్యత్వ నమోదులో సత్తా చాటిన ఎమ్మెల్యేలు, నేతలను టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం నాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదులో తొలి 10 స్థానాల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నేతలను పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు. తక్కువ సమయంలోనే 52 లక్షల సభ్యత్వాలకు చేర్చడంపై మంత్రి లోకేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 

కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని విధాలా దెబ్బతిన్న ఏపీని ఓవైపున కూటమి ప్రభుత్వం గాడినపెడుతోంది. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సరైన చోట సరైన మనిషిని ఉంచుతామన్న మాటకు కట్టుబడి పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులతో బాధ్యత అప్పగించాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పని చేశాయి. గత వైసీపీ అరాచక పాలనలో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నా.. భయపడకుండా పోరాటం చేయడంతో 57 శాతం ఓట్లతో 93 శాతం స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అతి తక్కువ మెజారిటీతోనే 11 సీట్లలో వేరే పార్టీ నేతలు నెగ్గారని’ అన్నారు.

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
-  కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తీసుకొచ్చాం. పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 
-  కొద్ది రోజుల్లోనే సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పని చేయాలి.  
-  పార్టీ సభ్యత్వాన్ని గత నెల 26న ప్రారంభించాం... ఇప్పటికి 52.45 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు. ఇదొక చరిత్ర. 
-  రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్ 10లోఉన్నాయి. అక్కడి నాయత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 
-  సభ్యత్వాల నమోదపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని లక్ష్యం దిశగా తీసుకెళ్తున్న మంత్రి లోకేష్ ను అభినందిస్తున్నా.  
-  రోజుకు వేలాదిగా సభ్యత్వాలు నమోదువుతున్నాయి. 
-  తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగం పుంచుకుంటోంది. 
-  రూ.1 లక్షతో శాశ్వత సభ్యత్వ విధానం మొదటిసారి తెచ్చాం. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తోంది. శాశ్వత సభ్యత్వ రుసుము ద్వారా వచ్చే వాటితో నిరుపేద కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.  
-  గతంలో రూ.100లతో రూ.2 లక్షలు బీమా ఉండేది... ఇప్పుడు దాన్ని రూ.5 లక్షలకు పెంచాం. 
-  రాబోయే రోజుల్లో కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. 
-  5 ఏళ్లలో పార్టీ కేడర్ కు రూ.140 కోట్లు బీమా, ఆరోగ్యం, విద్య కోసం సాయం అందించాం. 
-  టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తాం. 
-  రోడ్ల మరమ్మతులకు రూ.14 వందల కోట్లు మంజూరు చేశాం. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తాం. 
-  యువతకు ఉద్యోగ లక్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
-  మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమే. ప్రజలను చైతన్యవంతం చేస్తూ మనం చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరించాలి. 
-  ఇది సంక్షేమానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నాం. 
-  అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తాం. 
-  గత ఐదేళ్లు విచ్చలవిడితనంతో ఎక్కడికక్కడ భూ సమస్యలు సృష్టించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.

Also Read: Cyclone Fengal Effect: దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను, ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు - ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Embed widget