PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
New PAN Card: పాన్ 2.0 అనే కొత్త సిస్టంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత వ్యవస్థ కంటే మరింత అడ్వాన్స్‌డ్‌గా ఈ కొత్త టెక్నాలజీ ఉండనుంది. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి?
PAN 2.0 Features: భారత ప్రభుత్వం పాన్ 2.0 అని పిలిచే కొత్త అధునాతన పాన్ సిస్టమ్‌ను (New PAN Card) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం లక్ష్యం ఏంటంటే... అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు పాన్‌ను ఉమ్మడి వ్యాపార గుర్తింపు కార్డుగా ఏర్పాటు చేయడం. ఇప్పుడు కొత్త పాన్ కార్డు పాత కార్డుకు భిన్నంగా ఎలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ తీసుకొస్తున్న ఈ కొత్త పథకం గురించి తెలుసుకుందాం.
పాన్ 2.0 కొత్త ఫీచర్లు
పర్మినెంట్ అకౌంట్ నంబర్‌ను (PAN) 1972లో మొట్టమొదటగా ప్రారంభించారు. దశాబ్దాలుగా పన్ను చెల్లింపుదారులకు గుర్తింపు కార్డుగా ఇది ఉపయోగపడుతోంది. పాన్ 2.0 అనేది పాత సిస్టమ్‌కు సంబంధించిన టెక్నికల్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ప్లాన్‌తో సరిపోతుందని చెప్పవచ్చు.
ఈ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,435 కోట్లు వెచ్చించనుంది. కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది స్కానింగ్‌ను సులభతరం చేస్తుంది. మరిన్ని ఆన్‌లైన్ పనులు చేయవచ్చు. ఈ విధంగా పాన్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ అవుతుంది. ఇది సెక్యూరిటీని కూడా పెంచుతుంది. ఈ కొత్త వ్యవస్థ పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, మెరుగైన అనుభవాన్ని అందించడం, వారి సేవలను మరింత సులభంగా, సమర్ధవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ సిస్టమ్ వ్యాపార కార్యకలాపాలకు సాధారణ గుర్తింపు కార్డుగా పని చేస్తుంది.
Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
అలాగే పెరుగుతున్న ప్రమాదాలకు వ్యతిరేకంగా, మరింత ప్రభావవంతంగా ఉండేలా భద్రతా వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ పాన్ కార్డుకు పేపర్ వర్క్‌తో ఎటువంటి పనీ ఉండదు. ఇది పర్యావరణ పరంగా కూడా ఈ పథకాన్ని చాలా ప్రయోజనకరంగా చేస్తుంది. దీని వల్ల ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుంది.
కేంద్ర మంత్రి ఏం చెప్పారు?
ప్లాన్‌ను ప్రకటించిన మంత్రి అశ్విని వైష్ణవ్, “పాత వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసి డిజిటల్ ప్రాతిపదికన కొత్త పద్ధతిని తీసుకువస్తాం. దీనిని ఉమ్మడి వ్యాపార గుర్తింపు కార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తాం. దీనికి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంటుంది. ఇది పూర్తిగా పేపర్ లెస్‌గా ఉంటుంది. అలాగే ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది."
క్యాబినెట్ బ్రీఫింగ్ ప్రకారం పాత పాన్ కార్డును అదనపు ఖర్చు లేకుండా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 78 కోట్ల మంది పాన్ యూజర్లు ఉన్నారు. ఇది ఒక ముఖ్యమైన పత్రం. పన్ను చెల్లింపు, ఆదాయపు పన్ను రిటర్న్స్, అసెస్‌మెంట్‌కు సంబంధించిన వివిధ పత్రాలను లింక్ చేయడంలో సహాయపడుతుంది. దీని ద్వారా పన్ను ఎగవేతను గుర్తించడంలో ప్రభుత్వం సహాయం పొందుతుంది.
Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!