Union Bank: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 అప్రెంటిస్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2691 అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Union Bank Recruitment: ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైన విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 2691
రాష్ట్రాల వారిగా అప్రెంటిస్ పోస్టులు..
⏩ తెలంగాణ: 304
పోస్టుల కెటాయింపు: యూఆర్- 123, ఎస్సీ- 48, ఎస్టీ- 21, ఓబీసీ- 82, ఈడబ్ల్యూఎస్- 30.
⏩ ఆంధ్రప్రదేశ్: 549
పోస్టుల కెటాయింపు: యూఆర్- 222, ఎస్సీ- 87, ఎస్టీ- 38, ఓబీసీ- 148, ఈడబ్ల్యూఎస్- 54.
⏩ అరుణాచల్ ప్రదేశ్: 01
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ అస్సాం: 12
పోస్టుల కెటాయింపు: యూఆర్- 07, ఎస్టీ- 01, ఓబీసీ- 03, ఈడబ్ల్యూఎస్- 01.
⏩ బీహార్: 20
పోస్టుల కెటాయింపు: యూఆర్- 10, ఎస్సీ- 03, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 02.
⏩ చండీగఢ్: 11
పోస్టుల కెటాయింపు: యూఆర్- 07, ఎస్సీ- 01, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01.
⏩ ఛత్తీస్‌గఢ్: 13
పోస్టుల కెటాయింపు: యూఆర్- 07, ఎస్సీ- 01, ఎస్టీ- 04, ఈడబ్ల్యూఎస్- 01.
⏩ గోవా: 19
పోస్టుల కెటాయింపు: యూఆర్- 13, ఎస్టీ- 02, ఓబీసీ- 03, ఈడబ్ల్యూఎస్- 01.
⏩ గుజరాత్: 125
పోస్టుల కెటాయింపు: యూఆర్- 54, ఎస్సీ- 08, ఎస్టీ- 18, ఓబీసీ- 33, ఈడబ్ల్యూఎస్- 12.
⏩ హర్యానా: 33
పోస్టుల కెటాయింపు: యూఆర్- 16, ఎస్సీ- 06, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 03.
⏩ హిమాచల్ ప్రదేశ్: 02
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
⏩ జమ్ము కాశ్మీర్: 04
పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ- 01.
⏩ జార్ఖండ్: 17
పోస్టుల కెటాయింపు: యూఆర్- 08, ఎస్సీ- 02, ఎస్టీ- 04, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01.
⏩ కర్ణాటక: 305
పోస్టుల కెటాయింపు: యూఆర్- 124, ఎస్సీ- 48, ఎస్టీ- 21, ఓబీసీ- 82, ఈడబ్ల్యూఎస్- 30.
⏩ కేరళ: 118
పోస్టుల కెటాయింపు: యూఆర్- 64, ఎస్సీ- 11, ఎస్టీ- 01, ఓబీసీ- 31, ఈడబ్ల్యూఎస్- 11.
⏩ మధ్యప్రదేశ్: 81
పోస్టుల కెటాయింపు: యూఆర్- 33, ఎస్సీ- 12, ఎస్టీ- 16, ఓబీసీ- 12, ఈడబ్ల్యూఎస్- 08.
⏩ మహారాష్ట్ర: 296
పోస్టుల కెటాయింపు: యూఆర్- 133, ఎస్సీ- 29, ఎస్టీ- 26, ఓబీసీ- 79, ఈడబ్ల్యూఎస్- 29.
⏩ ఢిల్లీ: 69
పోస్టుల కెటాయింపు: యూఆర్- 30, ఎస్సీ- 10, ఎస్టీ- 05, ఓబీసీ- 18, ఈడబ్ల్యూఎస్- 06.
⏩ ఒడిశా: 53
పోస్టుల కెటాయింపు: యూఆర్- 23, ఎస్సీ- 08, ఎస్టీ- 11, ఓబీసీ- 06, ఈడబ్ల్యూఎస్- 05.
⏩ పంజాబ్: 48
పోస్టుల కెటాయింపు: యూఆర్- 21, ఎస్సీ- 13, ఓబీసీ- 10, ఈడబ్ల్యూఎస్- 04.
⏩ రాజస్థాన్: 41
పోస్టుల కెటాయింపు: యూఆర్- 18, ఎస్సీ- 06, ఎస్టీ- 05, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 04.
⏩ తమిళనాడు: 122
పోస్టుల కెటాయింపు: యూఆర్- 54, ఎస్సీ- 23, ఎస్టీ- 01, ఓబీసీ- 32, ఈడబ్ల్యూఎస్- 12.
⏩ ఉత్తరాఖండ్: 09
పోస్టుల కెటాయింపు: యూఆర్- 07, ఎస్సీ- 01, ఓబీసీ- 01.
⏩ ఉత్తర ప్రదేశ్: 361
పోస్టుల కెటాయింపు: యూఆర్- 150, ఎస్సీ- 75, ఎస్టీ- 03, ఓబీసీ- 97, ఈడబ్ల్యూఎస్- 36.
⏩ వెస్ట్ బెంగాల్: 78
పోస్టుల కెటాయింపు: యూఆర్- 34, ఎస్సీ- 17, ఎస్టీ- 03, ఓబీసీ- 17, ఈడబ్ల్యూఎస్- 07.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.02.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అబ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/మాహిళా అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, స్థానిక భాషపై పట్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్- 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్- 25 మార్కులు, క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్- 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్- 25 మార్కులు ఉంటాయి. సమయం: 60 నిమిషాలు.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05.03.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

