అన్వేషించండి

Telangana Vimochana Day: నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?

Telangana News: కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. దీనిపై బీజేపీ తప్పుబడుతోంది.

Why Telangana Vimochana Day is Celebrated: ఏటా తెలంగాణలో సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు.. ఆ రోజు విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాలు బయటికి వస్తూ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ సెప్టెంబరు 17ను గుర్తించకుండా వేడుకలకు దూరంగా ఉందని మరొక పార్టీ ఆరోపిస్తుంటుంది. ఆ ఇంకో పార్టీ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి మరీ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతుంటుంది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవానికి మరో పేరు పెట్టి, ఆ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుతామంటూ ప్రకటించింది. ఇలా సెప్టెంబరు 17ను వివిధ రాజకీయ పార్టీలు వారి రాజకీయాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి. ఇంతకీ సెప్టెంబరు 17కి చరిత్రలో ఉన్న ప్రాధాన్యం ఏంటి? 

సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం. అంటే 1948కి ముందు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజును తెలంగాణ విమోచన దినంగా పిలుస్తారు. నిజానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికే ఉన్న ఎన్నో సంస్థానాలు, రాజ్యాలు భారత యూనియన్ లో కలిసిపోయాయి. ఒక్క హైదరాబాద్ తో పాటు, కశ్మీర్ రాజ్యాలు మాత్రమే భారత్‌లో కలిసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నిజాం రాజు నుంచి స్వాతంత్ర్యం రాలేదు. దేశమంతా ఆంగ్లేయులు, వివిధ పాలకుల నుంచి విముక్తి కలిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుండగా.. హైదరాబాద్‌లో మాత్రం ప్రజలు నిజాం ఏలుబడిలో ఇంకా పీడితులుగానే ఉండిపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడో నిజాం ప్రయత్నించేవారు. లేదంటే హైదరాబాద్ ను పాకిస్థాన్ లో అయినా విలీనం చేయాలని భావించేవారు. భౌతికంగా అది సాధ్యం కాకపోయినప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నించారు.

సైనిక చర్యతో నిజాం మెడలు వంచి..
దీంతో భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టింది. అలా 1948 సెప్టెంబర్ 13న భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. అలా భారత సేనల చొరబాటును నిజాం సైన్యం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు కాక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 18 నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం అయింది. అందుకని సెప్టెంబరు 17న నిజాం లొంగుబాటుకు కారణంగా ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా పరిగణిస్తూ వస్తున్నారు.

ప్రజా పాలన దినంగా గుర్తించిన కాంగ్రెస్
సెప్టెంబరు 17ను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినంగా గుర్తించి, వేడుక తరహాలో నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతలను వివిధ నేతలకు అప్పగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు.

అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అనేవారని.. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం అంటోందని అన్నారు. విమోచన దినం అనడానికి వారికి ఉన్న అభ్యంతరాలు ఏంటని లక్ష్మణ్ నిలదీశారు. హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం, ఆ పార్టీ అధినేతలు ఒవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారని లక్ష్మణ్ నిలదీశారు. 

ఎన్నో తరాలుగా నిజాం ప్రభుత్వంలో ప్రజలు అల్లాడిపోయారని.. అలాంటిది సెప్టెంబరు 17న ఇక్కడి ప్రజలకు నిజాం నుంచి విముక్తి కలిగితే దాన్ని విమోచన దినం అనేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నిలదీశారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలవాలని కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Crime News: ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
Viral News: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
Embed widget