Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Telangana : తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం 9వ తేదీన ఆవిష్కరించనున్నారు. అయితే ఆ విగ్రహం ఎలా ఉంటుందో ఇప్పటి వరకూ అధికారికంగా బయటకు రాలేదు. కానీ అనధికారింగా లీక్ అయింది.
Model of Telangana mother statue leaked: తెలంగాణ తల్లి విగ్రహం కొత్తగా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లో భారీ కార్యక్రమంగా నిర్వహించి ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసినందున ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించి ఏర్పాట్లు పూర్తి చేశారు. విగ్రహాన్ని సిద్దం చేయించి.. సెక్రటేరియట్‌లో కొత్తగా నిర్మించిన దిమ్మె మీదకు చేర్చారు. అయితే ఆ విగ్రహం రూపు రేఖలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే గతంలోకేసీఆర్ ప్రభుత్వం ఖరారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ అధికారికంగా గుర్తించలేదు. సొంతంగా తయారు చేయించారు.
గతంలో రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయించారు. తెలంగాణ భవన్ లో ఇదే విగ్రహం ఉంటుంది. కాస్త తెలుగు తల్లి విగ్రహంలాగానే ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఇది దొరల పాలనను ప్రతిబింబిచేలా ఉందని.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా లేదని విమర్శించేవారు. తాము వచ్చిన వెంటనే తెలంగాణ సగటు మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని ఆవిష్కరిస్తామని ప్రకటించేవారు. చెప్పినట్లుగానే ఇప్పుడు అచ్చంగా సాధారణ తెలంగాణ మహిళ రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయించారు.
తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకగా చూపేట్లుగా రూపొందించబడింది.
— Baddam Mitra reddy (@BaddamMitra) December 6, 2024
"తెలంగాణ తల్లి" చిత్రంలో ఒక మహిళా ప్రతిమ ఉంది. ఆమె ఒక ఆధునిక భారతీయ స్త్రీ వేషంలో ఉంటుంది, ఆమె చేతల్లో వివిధ రకాల పంటల గింజలు మరియు పండ్లు ఉన్నాయి, ఇవి తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవసాయ సంపదను… pic.twitter.com/flGNGHv82O
చేతిలో తెలంగాణలో విస్తృతంగా పండే నాలుగు రకాల పంటలతో అభయహస్తం చూపిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీర చూడటానికి అమ్మను గుర్తుకొచ్చేలా ఉందన్న భావన వ్యక్తమయ్యేలా సిద్ధం చేశారు. కిరీటాలు, వడ్డాణాలు వంటి హంగులు తెలంగాణ తల్లి విగ్రహానికి పెట్టలేదు.
ఇదుగో మన తెలంగాణ తల్లి విగ్రహం
— Narsimha Kodangal (@Narsimha_Bagari) December 6, 2024
సగటు తెలంగాణ ఆడబిడ్డను, తెలంగాణ గ్రామదేవతలను తలపించేలా తెలంగాణ తల్లి..
వేలాది మంది అమరవీరుల త్యాగాలు
లక్షలాది మంది ఉద్యమకారుల పోరాటాలకు గుర్తుగా పిడికిళ్లతో తెలంగాణ తల్లి పీఠం pic.twitter.com/OSlmWDA5hW
ఈ విగ్రహం నమూనాను ఇంకా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. మాములుగా అయితే అందరి ఆలోచనలు తీసుకుని .. ఏకాభిప్రాయంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయాలి. కానీ బీఆర్ఎస్ నేతలు ఎలా చేసినా వ్యతిరేకిస్తారని వివాదం చేస్తారని గతంలో .. లోగో మార్పు సమయంలో జరిగిన ఘటనలతో ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. తామే సొంతంగా ముఖ్యంగా..సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విగ్రహాన్ని డిజైన్ చేయించారు.
ఆవిష్కరణ తర్వాత భారత రాష్ట్ర సమితి ఈ విగ్రహం రేవంత్ కుటుంబ సభ్యులను పోలి ఉందని విమర్శలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో
— Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1) December 6, 2024
తెలంగాణ చరిత్రపై, అస్థిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి అంటే ఒక దేవతా మూర్తి..
కిరీటం లేకుండా దేవత ఉంటుందా ?
బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు,
అసలు తెలంగాణ ఆత్మనే లేదు,
పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలాడుతోంది నా… pic.twitter.com/FNDKNKVrdT