Viral News: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
Swiss Air: స్విస్ ఎయిర్ విమానంలో ఓ జంట శృంగారం పూర్తి చేసింది. అయితే క్యాబిన్ క్రూ ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.
Swiss Air couple caught in mid-air steamy session in the middle of plane galley: బ్యాంకాక్ నుంచి స్విట్జర్లాండ్ కు వెళ్తున్న స్విస్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ జంట శృంగార సామ్రాజ్యంలో ఏలుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమీ విమానంలో సీసీ కెమెరా ఫుటేజీ కాదు. మరి ఎలా వచ్చింది. ఆ జంటనే అటు నేల మీద ఇటు నింగి మీద కాకుండా రెండింటి మధ్య తమ రసస్వాదన గుర్తుండాలని సీక్రెట్ గా చిత్రీకరించుకున్నారా అంటే అదీ లేదు. ఆ పని చేసింది విమానం క్యాబిన్ క్రూ. అంటే ఎయిర్ హోస్టెస్‌లు ఇతర సిబ్బంది. వారు తమ పనిలో ఉండి పట్టించుకోవడం లేదులే అని వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో లీక్ అయింద. వీరు చేసింది చిన్న నేరం కాదని ఇప్పుడు తెలుస్తోంది.. ఆ జంటది కాదు.. వారు చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో లీక్ చేసిన క్యాబిన్ క్రూది.
నవంబర్‌లో స్విస్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఓ జంట బ్యాంకాక్ నుంచి స్విస్ కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కొత్త జంటనో వారికి ఫాంటసీనో కానీ విమానంలో ఓ సారి తమ పని పూర్తి చేయాలనుకున్నారు. ఎక్కడెక్కడ అనువైన ప్లేస్ వెదుక్కున్నారు. బాత్ రూంలో అయితే కన్వీనియంట్ గా ఉండదని.. అక్కడ టీ , కాఫీలు పెట్టుకునే చిన్న కిచెన్ లాంటి ఏర్పాటు ఉంటే అక్కడైతే బెటర్ గా ఉంటుందని అనుకున్నారు. వీరి తీరును కాస్త అనుమానాస్పదంగా చూస్తున్న ఎయిర్ హోస్టెస్‌లకు సీన్ అర్థమైపోయింది. వారేం చేయబోతున్నారో అర్థం చేసుకుని ఆ ప్రాంతంలో సీక్రెట్ కెమెరా పెట్టేశారు. తర్వాత వారి గురించి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయారు.
ఆ జంట ఎయిర్ హోస్టెస్‌లు చూస్తున్నారని అనుకోలేదో.. చూస్తే చూశారని అనుకున్నారేమో కానీ తాము ముందుగా ఎంచుకున్న ప్లేస్ కు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి పని పూర్తి చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఏమీ తెలియనట్లుగా వచ్చి సీట్లలో కూర్చుండిపోయారు. ఎయిర్ హోస్టెస్‌లు కూడా తర్వాత వెళ్లి ఈ సీక్రెట్ వీడియోను సేవ్ చేసుకున్నారు. వాళ్లలో వారు చూసుకుని నవ్వుకున్నారో ఫ్రెండ్స్ షేర్ చేశారో కానీ అది సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. వెంటనే వైరల్ అయిపోయింది.
A couple on board a recent Swiss Air flight from Bangkok to Zurich joined the mile-high club in the first-class galley while secretly being recorded by the pilots.
— ᒍᑌᔕT ᗰIKE (@JustMikeMcKay) December 5, 2024
The cockpit crew are now under investigation for sharing the footage on group chats which has since gone viral. pic.twitter.com/B9cGA8dVKZ
ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ప్రయాణికుల పట్ల అనుచితంగా వ్యవహరించడమేనని స్విస్ ఎయిర్ లైన్స్ నిర్దారించింది. క్యాబిన్ క్రూపై విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయిన తర్వాత వారి ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ జంటపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత లేదు.