Fun Bucket Bhargava: ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Youtuber: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు పోక్సో కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. తనతో రీల్స్ చేసే మైనర్ బాలికపై భార్గవ అత్యాచారానికి పాల్పడ్డాడు.
Youtuber Fun Bucket Bhargav sentenced to 20 years in prison by POCSO court: విశాఖకు చెందిన యూట్యూబర్ భార్గవకు పోక్సో కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫన్ బకెట్ పేరుతో వీడియోలు తీసి కామెడీ చేసేవాడు. అయితే ఆయనతో పాటు రీల్స్ చేసే బాలికను గర్భవతిని చేశాడు. అత్యాచారం చేసినట్లుగా నిర్ధారణకావడంతో పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. బాధితులు 2021లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో కోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చింది. ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు నాలుగు లక్షల జరిమానా కూడా విధించారు.
ఫన్ బకెట్ భార్గవ అత్యాచారం చేసిన బాలిక వయసు కేవలం పద్నాలుగు ఏళ్లు మాత్రమే. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ .. టిక్ టాక్ యాప్ ను ఉపయోగించుకుని ఫేమస్ అయ్యారు. చిన్న చిన్న కామెడీ వీడియోలు తీస్తూ ఫాలోయర్స్ ను పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయనతో కలిసి వీడియోలు చేసేందుకు కావాలంటూ పలువురు అమ్మాయిల్ని ట్రాప్ చేశారు. కొంత మందితో వీడియోలు చేసిన తర్వాత వారు సైడ్ అయిపోయారు. కొంత మందిని మాత్రం భార్గవ లోబర్చుకున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికను ట్రాప్ చేశాడు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని కలిసి వీడియోలు చేద్దామని పిలిచాడు.
Also Read: పెళ్లి చేసుకుని బిడ్డను కని భార్యను వదిలేశాడు - 2 రోజులుగా భర్త ఇంటి ముందే బాధితురాలి మౌన పోరాటం
ఆ బాలిక భార్గవను నమ్మించి టిక్ టాక్ వీడియోలు తీయడం ప్రారంభించాడు. మెల్లగా మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. బయట అందరికీ తన చెల్లి అని చెప్పేవాడు. ఆ బాలిక కూడా అన్నయ్యా అని పిలిచేది. అయినా తప్పుడు పనులు మాత్రం ఆపలేదు. టిక్ టాక్ వీడియోలు కాదని ఇక వెబ్ సిరీస్‌లు కూడా చేద్దామని మాయమాటలు చెప్పి పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు.. చిన్న పిల్లను ఏమీ చేయడని అనుకున్నారు కానీ... బాలిక శరీరంలో వస్తున్న మార్పులు గమని.. పరీక్షలు చేయించారు. దాంతో గర్భవతి అని తేలింది. కారణం భార్గవ్ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ కేసు నమోదు చేసి భార్గవ్ అరెస్టు చేశారు. కొన్నిరోజులకు బెయిల్ పై వచ్చాడు కానీ..ఇప్పుడు ఇరవై ఏళ్ల పాటు జైల్లో ఉండేందుకు సిద్దమయ్యాడు.