అన్వేషించండి

Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

Tigers In Adilabad: ఆదిలాబాద్‌లో సంచరిస్తున్న పులులు ప్రజల ఉపాధికి ఆటంకం కలిగిస్తున్నాయి. పులి భయంతో పనులు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు.

Tiger In Adilabad District: ఇదిగో పులి అంటూ ఉంటే ప్రజల నోటికాడ కూడు పోతోంది. కొన్ని వారాల నుంచి ఉపాధి లేక చాలా మంది కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ముమ్మరంగా పొలం పనులు సాగే టైంలో పులుల సంచారం కడుపు కొడుతోందని వాపోతున్నారు. వెంటనే అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం, ప్రజల సమస్యలపై ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్.

Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం ప్రజలకు కునుకు లేకుండానే కాదు కడుపు మాడ్చేస్తోంది. రోజుకో ప్రాంతంలో పశువులపై దాడి చేయడంతో ప్రజలు బెదిరిపోతున్నారు. పనులు చేయించడానికి ఎవరూ సాహసించడం లేదు. రిస్క్ ఎందుకులే అని పనులు మానుకుంటున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్, అడెల్లి తండా, కుంటాల మీదుగా మహబూబ్ ఘాట్ దాటి మామడ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ భుర్కరేగడి అటవి ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసింది. అక్కడే విశ్రాంతి తీసుకొని పెంబి తాండలోకి  ఎంట్రీ ఇచ్చింది. అక్క వంకతుమ్మ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తూ మరో ఎద్దును హత మార్చింది.  Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగపూర్, చీమనాయక్ తండ సరిహద్దు మీదుగా చాందోరి, రాజుగుడా ప్రాంతంలో ప్రజలకు కనిపించింది. అక్కడ ఎద్దుపై దాడి చేసి వెళ్లిపోతున్న పులిని స్థానిక ప్రజలు, రైతులు, కూలీలు చూశారు. వారంతా భయాందోళనకు గురై అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. తర్వాత నార్నూర్ మండలంలోని చోర్ గావ్ సమీపంలోని పత్తి చేనులో పశువును హతమార్చింది. ట్రాక్ కెమెరాలకి కూడా చిక్కింది. తర్వాత రోజు పూనాగూడా సమీపంలో కనిపించింది. అక్కడి నుంచి మహారాష్ట్రకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

"జానీ" అనే మగ పులి ఆడ పులి కోసం వెతుకుతోందని అధికారులు చెబుతున్నారు. ఆ రెండు కలిసి పిల్లలు పుట్టి అవి వేట నేర్చుకునే వరకు పులులు ఆ ప్రాంతంలోనే ఉంటాయని అంటున్నారు. పులుల సంచారంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఏదో చోట పశువులపై దాడి చేస్తుందన్న సమాచారంతో భయపడి పోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు. Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

చాందోరి, రాజుగూడా, చోర్ గావ్ సమీపంలో పులి సంచారంచి పశువులపై దాడి చేయడంతో పత్తి చేలల్లో పని చేస్తున్న వారంతా ఇళ్లకు పరుగులు తీశారు. పంటచెలల్లో ఉన్న పశువులు, మేకలను ఇళ్ళ వద్దకు తీసుకువచ్చారు. అసలే పత్తి సీజన్.. పత్తి ఏరి అమ్ముకుంటే తప్ప పూట గడవదు. ఇలాంటి టైంలో పులి సంచారంతో నిరుపేద రైతులు ఉపాధి కోల్పోతున్నారు. 
పత్తి ఏరడానికి కూలీలు దొరకడం లేదని,  రైతులు కూలీలకు చెల్లించాల్సిన కూలీ కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు రైతులు. పులి భయంతో వణికిపోతూ.. కూలీలేవరూ పత్తి ఏరడానికి రావడం లేదని వాపోతున్నారు. పులిని వేరే ప్రాంతానికి పంపించగలిగితే తమ పత్తి తీసి అమ్ముకోవచ్చని అంటు్నారు. కూలీలకు కూలీ చెల్లించవచ్చని పలువురు ఏబీపీ దేశంతో వివరించారు.Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

పులి పశువులపై దాడి చేసి హతమార్చే సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఏబిపీ దేశంతో మాట్లాడారు. పులి ఎటువైపు నుంచి ఎలా వచ్చింది? ఎలా దాడి చేసింది అప్పుడు ఆ సమయంలో వారంతా ఏం చేశారనే విషయాలను వివరించారు. తాము వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా ఎటువైపు నుంచి వచ్చిందో పులి పశువులపై దాడి చేసిందని అన్నారు. పశువుల అరుపులతో ఉలిక్కిపడి చూసేసరికి పులి ఉందని తెలిపారు. భయపడి తామూ కేకలు వేశామన్నారు. పులి అక్కడి నుంచి వెళ్లిపోయినా పనులు ఆపేసి ఇళ్లకు వెళ్లిపోయామన్నారు. Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

అటవీశాఖ అధికారులు కూడా పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులికి ఎలాంటి హాని చేయొద్దని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు వ్యవసాయ పనులు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. రైతులు, కూలీలు పత్తి ఏరడానికి వెళ్లొద్దని, చీకటి పడక ముందే ఇంటికి చేరుకోవాలని హితవు పలుకుతున్నారు. పులుల మధ్య ఇరుక్కుపోయిన జనాలు ఉపాధిని కోల్పోతున్నామని వాపోతున్నారు. Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు

Also Read: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget