అన్వేషించండి

Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఎన్ని పులులు తిరుగుతున్నాయో తెలియడం లేదు. ఈ పులుల సంచారంపై abp దేశం గ్రౌండ్ రిపోర్ట్.

Adilabad Tiger News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. రోజుకో చోట పశువులపై దాడి చేస్తూ... రోడ్లపై వెళ్లే వారికి వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులకు పంట చేలల్లో కనిపిస్తున్నాయి. ఇదివరకే నిర్మల్ జిల్లాలో హడలెత్తించిన పెద్దపులి సారంగాపూర్, అడెల్లితండా, కుంటాల మీదుగా తిరిగి మహబూబ్ ఘాట్ దాటి మామడ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. 

మామడ రేంజ్ పరిధిలోని భుర్కరేగడి అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. రెండు రోజులపాటు ఎద్దు మాంసాన్ని తిన్న పెద్దపులి అక్కడే విశ్రాంతి తీసుకొని పెంబి తాండలోకి ప్రవేశించింది. పెంబి తండా మీదుగా గంగాపూర్ అటవీ ప్రాంతం నుంచి వంకతుమ్మ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తూ ఎద్దు పై దాడి చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగపూర్, చీమనాయక్ తండ సరిహద్దు మీదుగా చాందోరి, రాజుగుడా ప్రాంతంలో సంచరించింది. రాజుగుడా సమీపంలో పశువులు మేపుతుండగా ఓ ఎద్దు పై పెద్దపులి అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ ఎద్దు పులి భయానికి ఆరుస్తూ తన కాలితో పెద్దపులిని తన్నింది. దీంతో పెద్దపులి సమీప అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. 

పశువుల అరుపులు విన్న కాపరి పరుగెత్తుకొని వచ్చాడు. అదే టైంలో పత్తి ఏరుతున్న కూలీలు అడుగా వచ్చారు వారందరికీ పెద్దపులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో పులి జామడ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఎద్దు కాలికి గాయం కావడంతో ఆ ఎద్దును యజమాని కుమ్ర ఆనంద్ రావు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించి గాయపడిన ఎద్దుకు చికిత్స కోసం పరిహారం అందిస్తామని రైతుకు భరోసా కల్పించారు. 

మరొసటి రోజు ఆ పులి గుంజాల అటవీ ప్రాంతం నుంచి నార్నూర్ మండలంలోని చోర్ గావ్ సమీపంలోని పత్తి చేనులో ఓ పశువుపై దాడి చేసి హతమార్చింది. అటవీశాఖ అధికారులు గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకుని, పులి పాదముద్రలు సేకరించి.. ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ పులి కెమెరాకు చిక్కింది. పశువును తింటుండగా ట్రాక్ కెమెరాలకు పులి చిత్రాలు చిక్కాయి. 

మరుసటి రోజు సాయంత్రం ఆ పులి అక్కడి నుంచి ఖైర్ దాట్వా మీదుగా లోకారి, ఖడ్కి మీదుగా గాదిగూడ మండలంలోని పూనాగూడా సమీపంలో సంచరించింది. పూనాగూడా మీదుగా బేలా మండలంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి మహారాష్ట్రకు చేరుకోబోతుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

అసలు ఈ పులి మామడ, పెంబి మీదుగా కడెం మండలంలోని కవ్వాల అభయారణ్యంలోకి ప్రవేశిస్తుందని అనుకున్నారు. కానీ ఆ పులి నదులు, కాలువల మార్గం గుండానే ప్రయాణిస్తూ చివరికి మహారాష్ట్రవైపే వెళ్తోంది. ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి కిన్వట్ మీదుగా బోథ్ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి సారంగాపూర్, కుంటాల వెళ్లి తిరిగి మహబూబ్ ఘాట్ దాటి మామడ, పెంబి, మీదుగా ఉట్నూర్, నార్నూర్ వెైపు వచ్చింది. ప్రస్తుతం గాదిగూడ మండల సమీపంలోకి చేరుకుందని, సుమారుగా ఇది 650 కిలోమీటర్లు ప్రయాణించిందని ఇంద్రవెల్లి రేంజ్ అధికారి సంతోష్ abp దేశంతో చెప్పారు

ఈ పులి పేరు "జానీ" అని చెబుతున్నారు. ఇది ఆడ పులి కోసం ఈ చలికాలంలో ప్రయాణాన్ని కొనసాగించిందని భావిస్తున్నారు. చలికాలం జత కట్టడానికి వెతుక్కుంటూ ఇలా తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. తమ రేంజ్ పరిధిలోని చోర్ గావ్ సమీపంలో తారాసింగ్ అనే రైతు యొక్క ఎద్దు పై దాడి చేసి హతమార్చిందని, వారికి అటవీశాఖ తరఫున పరిహారం అందజేస్తామన్నారు. పులి సంచారిస్తున్న వేళ సమీప గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమన్నారు. పులికి హాని చేయొద్దని జాగ్రత్తలు చెబుతున్నారు. పులి నుంచి కూడా హాని లేకుండా చర్యలు చేపడుతున్నారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ రేంజ్ పరిధిలో మరొక ఆడ పులి సంచరిస్తోంది. మహరాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి వాంకిడి మీదుగా నిషానీ మీదుగా కేరామేరీ అటవీ ప్రాంతం నుంచి జోడేఘాట్ అటవీ ప్రాంతంలోకి ఈ పులి సంచరిస్తూ వస్తూపోతోంది. రెండు వారాల క్రితం ఈ పులి భూసిమెట్ట క్యాంప్, సుంగాపూర్ సరిహద్దులోని లొద్ది ప్రాంతంలో ఆవుపై దాడి చేసి హతమార్చింది. తిరిగి అదే అటవీ ప్రాంతంలో శుక్రవారం మరొక ఆవుపై దాడి చేసి హతమార్చింది. పశువుల కాపరి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో అధికారులు పులి పాదముద్రలు సేకరించి అక్కడ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి కాగజ్ నగర్ కారిడార్ నుంచి వచ్చిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పులి పేరు S12 గా భావిస్తున్నారు. ఇటీవలే మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ సమీపంలో బుగ్గ గుట్టపై మేకలను కాసిపేట ధర్మారం సమీపంలో మేకలు, గొర్రెలపై దాడి చేసింది. అక్కడి నుంచి తిర్యాని వైపు వెళ్లిన పెద్దపులి అక్కడి నుంచి మంగి అటవీ ప్రాంతం మీదుగా జన్నారం సమీపంలోని కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించిందని చెబుతున్నారు. 

మగపులి ఆడపులి జత కోసం వచ్చిందని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఈ మూడు పులులు సంచరిస్తూ హడతిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూడా పులులు ఉన్నాయని, కానీ అవి కనబడటం లేదని అంటున్నారు. ఈ పులులు శీతాకాలంలో జతకట్టేందుకు ప్రయత్నిస్తుంటాయని, అందుకనే అవి ఇలా హడలెత్తిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మకాం మారుస్తున్నాయని అంటున్నారు. 

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget