(Source: Poll of Polls)
Adilabad Tiger News Today: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్ స్టోరీ
Tiger News Today: ఓ గుంపు పులులు అదిలాబాద్ అటవీ ప్రాంతానికి వచ్చాయి. అందులో ఫిమేల్ తప్పిపోయింది. దాని కోసం మగ పులులు వెతుకుతున్నారు. ఇదే వైల్డ్ యానిమల్ లవ్ స్టోరీ.
Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పెద్ద పులులు ప్రజలకు, అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయో అని భయంతో జనం బతుకుతున్నారు. పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిన పులులు మళ్లీ ఎందుకు పదే పదే వస్తున్నాయనే విషయంపై ఆరా తీసిన అధికారులు ఓ నిర్దారణకు వచ్చారు. తోడు కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్‌లో తిరిగే పులులు కూడా అదే కోవలోకి వస్తాయని అన్నారు.
ఆడ పులి కోసం వెతుకుతూ ఉండే మగ పులి ఎంత దూరమైన వెళ్తుందట. ఆహారం విషయంలో తన పరిధి దాటి వెళ్లని పులి... ఆడ పులి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు కూడా ఆడ తోడు కోసం వెతుకుతున్నాయని అంటున్నారు. జానీ అనే ఓ పెద్ద పులి మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చింది. ఆడ తోడు కోసం ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతోంది. రెండు రాష్ట్రాల పరిధిలో వందల కిలోమీటర్లు తిరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆడ పులిని వెతికే క్రమంలో కుంటాల, సారంగాపూర్, కుభీర్, దిలావర్పూర్, నర్సాపూర్(జి), పెంబీ, ఉట్నూర్, నార్నూర్ అడవుల్లో చక్కర్లు కొడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో సంచరిస్తున్న పెద్దపులి వయసు ఏడేళ్లుగా చెబుతున్నారు. ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో పులి జాడు గుర్తించిన అధికారులు రెండు మూడు మగ పులులు తిరుగుతున్నట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులుల్లో ఆడ పులి కూడా ఉంది. తప్పిపోయిన ఆ ఆడ పులి కోసం మగ పులుపు వెతుకుతున్నాయి.
గుంపు నుంచి తప్పి పోయిన ఆడ పులి ఎక్కడకు వెళ్లిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తిరికి వెళ్లిపోయిందా లేకుంటే ఈ ప్రాంతంలోనే వేరే చోట ఉండిపోయిందా అనేది మాత్రం గుర్తించ లేకపోతున్నారు. అధికారిక లెక్క ప్రకారం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పది నుంచి 12 పెద్ద పులులు ఉంటున్నాయి. ఇందులో రెండే ఆడ పులులు ఉన్నాయి.
ఇక్కడ ఉన్న ఆడ పులుల జాడ దొరికితే మాత్రం మరికొన్ని రోజులు ఈ జానీతోపాటు మిగతా పులుపు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి ఈ ఆడ మగ పులులు కలిస్తే పిల్లలు పుట్టిన వరకు మగ పులులు వాటికి అండగా ఉంటాయి. అంతే కాకుండా పుట్టిన పిల్లలు వేట నేర్చుకునే వరకు సంరక్షిస్తాయి. అందుకే మరికొన్ని నెలలు పులుల బెడద తప్పకపోవచ్చని అంటున్నారు.
ఆడ పులి శరీరం నుంచి ప్రత్యేకమైన వాసన వస్తుంది. దాని ఆధారంగానే మగ పులి గుర్తు పడుతుంది. కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఉన్న గుర్తుపడతారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగే వరకు ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. ఆ పులుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడవిలో ఇబ్బంది లేకపోయిన రైతులు అమర్చే కరెంటు తీగలతోనే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాటిని గుర్తించి తొలగిచామని పేర్కొన్నారు.
Also Read: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళు ప్రారంభం, రైతుల సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్