అన్వేషించండి
Advertisement
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Latest Weather : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల భయం వెంటాడుతుంటే... తెలంగాణ చలి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh And Telangana Weather Todays: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తెలంగాణ చలి తీవ్ర రోజు రోజుకు పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి జనం వణికిపోతున్నారు.
తెలంగాణలో వాతావరణం (Telangana Weather)
తెలంగాణలో చలిపులి వణికిస్తోంది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్ర బాగా పెరిగింది. వీటికి తోడు ఉదయం, సాయంత్రం వేళల్లో కురుస్తున్న పొగమంచు ప్రజలను వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
తెలంగాణలో రానున్న రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచులుచేస్తున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత రోగాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చలిగాలిలో తిరగొద్దని చెబుతున్నారు. వేడి ఆహారం తీసుకోవాలని బయట ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు.
బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ జిల్లాల్లో నమోదు అయింది. ఇక్కడ 11.8 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత గుర్తించదగిన తగ్గుదల అంటే 2.1 నుంచి 4 డిగ్రీల మధ్య పడిపోయిన జోన్‌లో ఖమ్మం ఉంది. తర్వాత భద్రాచలం, హకీంపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజమాబాద్, రామగుండం, రాజేంద్రనగర్‌లో సాధారణం కంటే తక్కువ ఉష్ణగ్రతలు(1.6- నుంచి 3 డిగ్రీలు) నమోదు అయిన ప్రాంతాలు. అంత కంటే ఎక్కువ పడిపోయిన ప్రాంతాల్లో అంటే 3.1 నుంచి 5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాల్లో ఆదిలాబాద్, హన్మకొండ, మెదక్, పటాన్‌చెరు ఉన్నాయి.
వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 | ఆదిలాబాద్ | 29.8 | 12.2 | 83 |
2 | భద్రాచలం | 30.5 | 18.8 | 92 |
3 | హకీంపేట | 28.6 | 15.3 | 52 |
4 |
దుండిగల్
|
29.9 | 15.3 | 61 |
5 |
హన్మకొండ
|
30.5 | 14.5 | 94 |
6 |
హైదరాబాద్
|
29.2 | 15.1 | 62 |
7 |
ఖమ్మం
|
32.5 | 18.2 | 82 |
8 |
మహబూబ్‌నగర్
|
30.0 | 17.7 | 73 |
9 |
మెదక్
|
30.2 | 11.8 | 71 |
10 |
నల్గొండ
|
29.5 | 19.0 | 76 |
11 |
నిజామాబాద్
|
32.3 | 15.6 | 79 |
12 |
రామగుండం
|
29 | 15.2 | 88 |
13 |
పటాన్‌చెరు
|
29.8 | 12.2 | 93 |
14 |
రాజేంద్రనగర్
|
29.0 | 13 | 85 |
15 |
హయత్‌నగర్
|
29.0 | 14.6 | 74 |
హైదరాబాద్‌లో వాతావరణం (Weather Update Hyderabad)
హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29°C, 15°C ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు/ఈశాన్య దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నమోదైన వాతావరణం:
గరిష్ట ఉష్ణోగ్రత: 28.8 °C
కనిష్ట ఉష్ణోగ్రత: 15.1°C
గరిష్ట ఉష్ణోగ్రత: 28.8 °C
కనిష్ట ఉష్ణోగ్రత: 15.1°C
ఆంధ్రప్రదేశ‌్‌లో వాతావరణం (Andhra Pradesh Weather Update)
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 |
కళింగపట్నం
|
30.1 | 16.1 | 79 |
2 |
విశాఖపట్నం
|
31.1 | 21.6 | 57 |
3 |
తుని
|
32.8 | 20.1 | 79 |
4 |
కాకినాడ
|
31.6 | 21 | 78 |
5 |
నర్సాపురం
|
32.9 | 21 | 65 |
6 |
మచిలీపట్నం
|
32.4 | 20.8 | 81 |
7 |
నందిగామ
|
31.2 | 17.2 | 87 |
8 |
గన్నవరం
|
30.4 | 20.4 | 76 |
9 |
అమరావతి
|
32.4 | 19.7 | 81 |
10 |
జంగమేశ్వరపురం
|
32 | 17.5 | 86 |
11 |
బాపట్ల
|
31.4 | 18.2 | 83 |
12 |
ఒంగోలు
|
32 | 22.5 | 72 |
13 |
కావలి
|
30.6 | 23.2 | 80 |
14 |
నెల్లూరు
|
31.5 | 24.1 | 87 |
15 |
నంద్యాల
|
31.6 | 18.6 | 82 |
16 |
కర్నూలు
|
31.7 | 19.6 | 81 |
17 |
కడప
|
31 | 21.3 | 90 |
18 |
అనంతపురం
|
29.7 | 19.2 | 89 |
19 |
ఆరోగ్యవరం
|
27 | 19.5 | 91 |
20 |
తిరుపతి
|
30.8 | 22.5 | 84 |
ఏపీలో నాలుగు రోజుల వాతావరణం ఎలా ఉంటుంది?
DAY 1(21.11.2024): ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాల్లో గంటకు 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
DAY 2 (22.11.2024): ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాల్లో గంటకు 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
DAY 3 (23.11.2024): దక్షిణ బంగాళాఖాతంలోని దక్షిణ మధ్య భాగాలలో గంటకు 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
DAY 4 (24.11.2024): నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాలలో గంటకు 45 కిమీ నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion