Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Real Estate: డిమాండ్ తగ్గిన హైదరాబాద్ రియల్ఎస్టేట్‌కు హైడ్రా కూడా ఓ కారణం. ఇప్పుడు హైడ్రానే మళ్లీ భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మార్కెట్ ఊపందుకుంటుందా ?
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు.
మొదట్లో సానుకూలత - తర్వాత వ్యతిరేక ప్రచారం
బడా బాబుల ఫామ్ హౌస్‌లను కూల్చివేసిన తర్వాత మాకూ ఓ హైడ్రా కావాలని జిల్లాల నుంచి పొరుగురాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు. ఆ తర్వాత హైడ్రాకు చట్టబద్దత వచ్చింది. అయినా హైడ్రా చాలా స్లోగా ఉంది. పైగా కూల్చివేతలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వర్గాల్లో నెలకొన్న భయాందోళనలపై స్పష్టతనిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని, చట్టబద్ధంగా చేపట్టిన వెంచర్ల విషయంలో ఆందోళన అక్కర్లేదని రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ ప్రకటించింది. చెల్లుబాటయ్యే అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయడం జరగదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీలోని వందనపురి కాలనీలో తాజాగా ఓ ఇంటిని హైడ్రా కూల్చింది. అది రోడ్డుకు అడ్డంగా ఆక్రమించి కట్టారు. పెద్ద ఎత్ుతన ఫిర్యాదులు రావడంతో పరిశీలన జరిపి నిజమేనని తేల్చి కూల్చేశారు. ఆ ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు. ఈ ప్రకారం చూస్తే.. హైడ్రా తర్వాత చేపట్టబోయే చర్యల ద్వారానే ఎక్కువ రియల్ ఎస్టేట్ ప్రభావితం కానుందని అనుకోవచ్చు. అందుకే హైడ్రాకు చట్టబద్దత వచ్చినా కోర్టుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా బుల్ డోజర్లు మాత్రం పక్కాగా అక్రమ కట్టడం అయితే తప్ప కదలడం లేదు. ముందుగా హైడ్రా అడ్డగోలు కూల్చివేతలు చేపట్టదన్న నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం
హైడ్రా నెమ్మది కావడంతో పాటు అనుమతులు ఉంటే నిశ్చితంగా ఉండవచ్చని భరో ఇవ్వడంతో బిల్డర్లలో నమ్మకం పెరుగుతోంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే ఎలాంటి సమస్యలు రావని నమ్మకంతో పనులు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌కు హైడ్రా కూడా ఓ కారణం. హైడ్రా మాత్రమే కారణం కాకపోవచ్చు. దేశమంతటా రియల్ ఎస్టేట్ స్లంప్‌లోనే ఉందని .. హైదరాబాద్‌లో కూడా అలాగే ఉందని ప్రత్యేకంగా హైడ్రా కారణం కాదని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇంటి కొనుగోలుకు అడ్వాన్సులు ఇచ్చిన చాలా మంది మిగిలిన పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు. అంటే హైడ్రా భయం తగ్గుతున్నట్లే అనుకోవచ్చు.