News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold Rate Today: తగ్గేదేలే - ఏప్రిల్‌లో ఒక్కరోజు కూడా తగ్గని బంగారం, రూ.3000 పెరిగిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rates Today In Hyderabad:

FOLLOW US: 
Share:

Gold Price Today 16th April 2022 : బంగారం ధరలు మార్చి 9వ తేదీన జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు సైతం దాదాపు ఆ ధరలకు చేరువలో ఉన్నాయి. గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. తాజాగా వరుసగా మూడో రోజు బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.220 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rates Today In Hyderabad) రూ.49,550కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,060 అయింది. వరుసగా నాలుగో రోజు పెరిగిన వెండి ధర రూ.200 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,400 కు ఎగబాకింది. ఈ నెలలో బంగారం రూ.3000 కు పైగా ధర పుంజుకుంది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.220 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 16th April 2022)  10 గ్రాముల ధర రూ.54,060 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.74,400 అయింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.200 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550 కు చేరింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.74,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.54,060 కి పెరిగింది. 
చెన్నైలో రూ.10 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,600 కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో రూ.12 మేర తగ్గడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,980కి దిగొచ్చింది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,240 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.  
ఢిల్లీలో 26 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.24,240 కి చేరింది. 
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,980 అయింది.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Weather Updates: బీ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక 

Also Read: Horoscope Today 16th April 2022: ఈ రాశివారు ఈ రోజు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి 

Published at : 16 Apr 2022 06:57 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate In Vijayawada Gold Rate Today Andhra Pradesh

ఇవి కూడా చూడండి

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్

Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు