Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
పాక్‌తో మ్యాచ్ డ్రాగా ముగించిన భారత హాకీ జట్టు
2022 ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది.
Peddapalli News : రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అంతర్గాం తహసీల్దార్
Peddapalli News : పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ సంపత్ లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. ఓ భూమి సర్వే విషయంలో 3 లక్షలు డిమాండ్ చేశారు తహసీల్దార్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా తహసీల్దార్ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నారు.
TS News : మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై ఎఫ్ఐఆర్ నమోదు
TS News : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించిన వైద్యుడు భూక్యా రామ్‌జీ నాయక్ భార్య భూక్య కళావతి ఫిర్యాదుతో రేణుకా చౌదరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎమ్ఎస్ చౌదరి, రేణుకా చౌదరి ఏడుగురు అనుచరులపై ఐపీసీ సెక్షన్లు 420, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(1) సెక్షన్‌ల కింద కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఇవాళ అరెస్టు!
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనంతబాబు పోలీస్ కస్టడీలో ఉన్నారని పేర్కొన్నారు. ఇవాళ అనంతబాబును అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే విషయంపై గన్‌మెన్లకు సంజాయిషీ నోటీసులను జారీచేశామని ఏఎస్పీ తెలిపారు.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు
ఉత్తర ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్వాపి మసీదు కేసులో దాఖలైన సివిల్ పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎకె విశ్వేషా విచారించారు. 19 మంది న్యాయవాదులు, 4 పిటిషనర్లు సహా 23 మందిని మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించినట్లు ANI పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

