By: ABP Desam | Updated at : 09 Apr 2022 11:55 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
RCB_Vs_MI_Result
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ముంబై ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యకుమార్ వన్‌మ్యాన్ షో...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి మూడు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ (26: 28 బంతుల్లో, మూడు ఫోర్లు), రోహిత్ శర్మ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) వేగం పెంచడంతో తర్వాతి మూడు ఓవర్లలో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
అయితే బెంగళూరు ప్రధాన బౌలర్ హర్షల్ పటేల్ తన మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం హర్షల్ పటేల్ బౌలింగ్‌లో తనకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. బేబీ ఏబీ అనే నిక్‌నేమ్‌తో ఎన్నో అంచనాలుగా బరిలోకి దిగిన డెవాల్డ్ బ్రెవిస్ (8:11 బంతుల్లో, ఒక ఫోర్) కూడా నిరాశ పరిచాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇషాన్ కిషన్, ఫాంలో ఉన్న తిలక్ వర్మ (0: 3 బంతుల్లో) అవుటయ్యారు. 11వ ఓవర్లో పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్‌ను (0: 1 బంతి) వనిందు హసరంగ అవుట్ చేయడంతో 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రమణ్ దీప్ సింగ్ (6: 12 బంతుల్లో) కూడా అవుటయ్యాడు.
ఈ దశలో జయదేవ్ ఉనద్కత్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అభేద్యమైన ఏడో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ 72 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 60 పరుగులను ముంబై సాధించడం విశేషం. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, వనిందు హసరంగ రెండేసి వికెట్లు తీయగా... ఆకాష్ దీప్‌కు ఒక వికెట్ దక్కింది.
అదరగొట్టిన అనూజ్...
152 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు ఇన్నింగ్స్ కూడా మెల్లగానే మొదలైంది. అనూజ్ రావత్ (66: 47 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (16: 24 బంతుల్లో, ఒక ఫోర్) జాగ్రత్తగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అయితే మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఫాఫ్ డుఫ్లెసిస్‌ను అవుట్ చేసి ఉనద్కత్ ముంబైకి మొదటి వికెట్ అందించాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (48: 36 బంతుల్లో, ఐదు ఫోర్లు), రావత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ బౌలర్లకు అస్సలు ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూజ్ రావత్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 52 బంతుల్లోనే 80 పరుగులు జోడించిన అనంతరం అనూజ్ రావత్ రనౌటయ్యాడు. విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీని డెవాల్డ్ బ్రెవిస్ అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన మొదటి బంతికే బ్రెవిస్ వికెట్ తీసుకోవడం విశేషం. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8 నాటౌట్: 2 బంతుల్లో, రెండు ఫోర్లు), దినేష్ కార్తీక్ (7 నాటౌట్: 2 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్‌లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు