Valentine's Day 2025: ప్రేమ కథ అంటే ఇది.. ప్రేమికులు అంటే ఇలా ఉండాలి.. ఇందులో ఒక్క లక్షణం అయినా మీకుందా!
Rathi manmadhan story in telugu: లోకాలన్నింటినీ మోహింప చేసే శక్తి ఆయనది..అలాంటి పురుషుడిని మైమరపించే సౌందర్యం ఆమెది. ఇంతకు మించిన అద్భుతమైన ప్రేమకథ ఇంకేం ఉంటుంది.

Love Story Of Kama Deva and Rati: రతీ మన్మథులు.. అసలైన ప్రేమకు సంకేతంగా వీరి పేర్లు చెబుతారు. మన్మథుడినే కామదేవుడు , రతి కాంతుడు, మదనుడు అని పిలుస్తారు. ప్రేమకు మరో పేరు గా నిలిచిన వీరి పెళ్లి గురించి 'కామవివాహం' అనే పేరుతో రుద్ర సంహితలో ఉంది.
బ్రహ్మదేవుడి మనసు నుంచి జన్మించాడు మన్మథుడు
దక్ష ప్రజాపతి కుమార్తె రతీదేవి అని పురాణాల్లో ఉంది
అందర్నీ మోహింపచేసే శక్తిని మన్మధుడికి ప్రసాదించాడు బ్రహ్మ. ఆ శక్తిని పరీక్షించుకోవాలని భావించిన మదనుడు..అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య సహా మరీచి, దక్షుడితో కలపి బ్రహ్మపైనా పూలబాణాలు ప్రయోగించాడు. ఎంతో కఠినమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వారందరిలో కామవికారం కలిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన శివుడు...వారిలో కామవికారం కలిగేందుకు కారణం మన్మథుడు అని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పరమేశ్వరుడి కోపాన్ని తట్టుకోలేక మన్మథుడు పక్కకు తప్పుకోవడంతో వాళ్లంతా సాధారణ స్థితికి వస్తారు.
తమను సైతం కామవికారానికి గురిచేసిన మన్మథుడు..శివుడి ఆగ్రహానికి గురై అంతమైపోతాడని శపిస్తాడు బ్రహ్మదేవుడు. శంకరుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బ్రహ్మ కాళ్లపై పడి శాపాన్ని ఉపసంహరించుకోమని అర్థిస్తాడు. శాంతించిన బ్రహ్మ ఇదంతా దైవ ప్రేరణ మాత్రమే..ఇది కూడా నీకు మంచి చేస్తుందని అభయం ఇస్తాడు.
Also Read: ఆలయం మొత్తం రంధ్రాలే.. బృహదీశ్వరాలయంలో దాగి ఉన్న రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రతీ దేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి... మన్మథుడి దగ్గరకు వచ్చి తన స్వేదం నుంచి జన్మించిన కుమార్తె అయిన రతీదేవిని పెళ్లిచేసుకోవాలని కోరుతాడు. రతీదేవిని చూసిన ఆ క్షణంలో మన్మథుడి బాణాలు తిరిగి తనకే తగిలాయి..అంతలా మోహింపచేసేంత సౌందర్యం ఆమె సొంతం. తన బాణాల కన్నా రతీ చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోతాడు. రతీదేవిని వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా జీవిస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా మర్చిపోతాడు.
మరి మన్మధుడు ఎలా అంతమయ్యాడు?
తారకాసురుడు శివుడిని మెప్పించి వరం పొందుతాడు. తన సంహారం కేవలం శివ-పార్వతుల సంతానం వల్ల మాత్రమే సాధ్యం అవ్వాలని వరం కోరుతాడు. అప్పటికే సతీదేవి వియోగంలో ఉన్న శివుడు మరో వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తాడు. పార్వతీదేవి ప్రేమను కనీసం పట్టించుకోడు. ఆ సమయంలో శివయ్య మనసు మళ్లింపజేయాలంటే మన్మథుడే సరైనవ్యక్తి అని భావిస్తారు దేవతలంతా. తారకాసురుడి ఆగడాలు చెప్పి శివపార్వతుల కళ్యాణం జరిగి సంతానం జన్మిస్తే ఆ రాక్షసుడి సంహారం జరుగుతుందని మొరపెట్టుకుంటారు. సరే అన్న మన్మధుడు.. తపస్సు చేసుకుంటున్న శివుడి మనసు మరల్చేందుకు బాణాలు ప్రయోగించి ...శంకరుడి ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోతాడు.
Also Read: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి - ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!
ప్రేమకు సంకేతం వీళ్లే ఎందుకు?
శివుడు కోపాగ్నిలో బూడిదైన మన్మథుడు..ఆ తర్వాత ప్రద్యుమ్నుడిలా జన్మించాడని భాగవతంలో వ్యాసమహర్షి రాశారు. పరమేశ్వరుడి ఆగ్రహానికి మసైపోయిన మదనుడిని చూసి రతీదేవి శోకంతో ఉంటుంది. ఓదార్చిన దేవతలు మన్మధుడు తిరిగి ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడని చెబుతారు. అలా శ్రీ కృష్ణుడు- రుక్మిణీదేవికి జన్మించిన సంతానమే ప్రద్యుమ్నుడు. ఆ బాలుడిని శంబరాసుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్లిపోతాడు . ఆ రాక్షసుడి బారినుంచి బాలుడిని రక్షించమని నారదుడు చెప్పడంతో ఆ ఇంట్లో దాసిగా చేరుతుంది రతీదేవి. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు రాక్షసుడు. ఓ చేప మింగేస్తుంది. ఆ చేప జాలరి చేత చిక్కడంతో తిరిగి శంబరాసుడి వంటగదికి చేరుతుంది. దాన్ని వండుదామని తీసిన రతీదేవికి బాలుడు కనిపిస్తాడు. అప్పటి నుంచి రహస్యంగా ఆ బాలుడిని కాపాడుతూ వచ్చి..తనకి యుక్త వయసు వచ్చిన తర్వాత గత జన్మ గురించి చెబుతుంది. శంబరాసురుడిని సంహరించి..రతీదేవితో కలసి ద్వారక నగరానికి వెళ్లిపోతాడు ప్రద్యుమ్నుడు.
Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
ఆలయ గోడలపై వీళ్ల చిత్రాలు ఎందుకు?
రతీ మన్మథులకు ఆలయాలు ప్రత్యేకంగా లేవు కానీ ఆలయాల గోడలపై వీరి ప్రేమ ప్రయాణ చిత్రాలు కనిపిస్తాయి. మన్మథుని పేరుతో ఎన్నో పండుగలు చేసుకుంటారు. కామదేవ పంచమి, కామమహోత్సవం, మదన త్రయోదశి, కాముని పున్నమి అని వివిధ సందర్భాల్లో పండుగ చేసుకుంటారు.
ఈ మంత్రం పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరుకుతుందని చెబుతారు పండితులు
ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి
తన్నో అనంగ ప్రచోదయాత్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

