అన్వేషించండి

Ratha Saptami Pooja Vidhanam In Telugu : రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం

Ratha Saptami 2023: మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 28 శనివారం వచ్చింది. ఈరోజున పాటించే ప్రతి చర్య వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలున్నాయి. పూజ ఇలా చేసుకోండి...

Ratha Saptami Pooja Vidhanam In Telugu : ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. భూమికి మొట్టమొదటగా దర్శనమిచ్చి, రథాన్ని అధిరోహించాడని ‘మత్స్య పురాణం’ చెబుతోంది. ప్రాణులకు చలిని తొలగించి, నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇతర మాసాలలో సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత వుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్యకశ్యపులకు సూర్యుడు జన్మించాడు.అందుకే ఈ రోజు సూర్య భగవానుడిని తమ శక్తికొలది పూజిస్తారు...

సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి

Also Read: కోణార్క్, అరసవెల్లి మాత్రమేకాదు - గుజరాత్ లో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయం గురించి తెలుసా!

పాలు పొంగించే విధానం

  • సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.
  • ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి
  • ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి
  • పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతు పరామానాన్ని తయారు చేయాలి
  • ఈ పరమానాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి
  • పాలు పొంగించడమంటే  ఇంటి అభివృద్ధికి సంకేతం. ముందుగా గణపతిని పూజించి...ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి.

Also Read: ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఓ పాఠం చెబుతుంది, రథ సప్తమి స్పెషల్

సూర్యారాధన వెనుకున్న ఆరోగ్య రహస్యం

  • ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యాలను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు.. అందుకే రథసప్తమి రోజు  తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు.
  • ఈ కాలం లో విరివిగా పాకే తీగ జాతికి చెందిన చిక్కుడు ఆకులపై పరమాన్నం వేసి సూర్యునికి నివేదిస్తారు. ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి. చిక్కుడు తరచు తినడం వలన మలబద్ధకం సమస్యలు తొలగుతాయి
  • ఈరోజు తరిగిన కూరగాయలు తినకూడదు… చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలని (చిక్కుడు కాయలను తరగవలసిన పనిలేదు.. చిక్కితే సరిపోతుంది ) పెద్దలు చెప్పడం లో ఉద్దేశ్యం కనీసం ఈరోజైనా చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే.
  • అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి.

ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ  రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు గొడుకు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవుపాలు, ఆవునెయ్యి దానం చేయడం మంచిది.  రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget