Sun Temple Modhera: కోణార్క్, అరసవెల్లి మాత్రమేకాదు - గుజరాత్ లో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయం గురించి తెలుసా!
Ratha Sapthami 2023: భారతదేశంలో సూర్య దేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది కోణార్క్ , ఆంధ్రప్రదేశ్ అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం. ఈ రెండింటితో పాటు మరో ప్రముఖ ఆలయం గుజరాత్ లో ఉంది
Sun Temple Modhera: బ్రహ్మ పురాణంలో ప్రస్తావించిన మోదెరా సూర్యభగవానుడి ఆలయం గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్య వంశానికి చెందిన సోలంకి కుటుంబసభ్యుడు సూర్య భగవానుడిని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. క్రీ.శ. 1026లో సోలంకి రాజవంశానికి చెందిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణంలో ఉన్న దాగి ఉన్న ఎన్నో అద్బుతాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అస్సలు సున్నం వినియోగించకుండా కట్టారు ఈ ఆలయాన్ని.
Also Read: ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఓ పాఠం చెబుతుంది, రథ సప్తమి స్పెషల్
- ఆలయ నిర్మాణ సమయంలో మొత్తం 108 ఆలయాలు నిర్మించారు. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించారు.
- నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాల పైనుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ, కింద నుంచి చూస్తే ఎనిమిది మూలాల అష్టభుజి స్తంభాలుగా కనిపిస్తాయి
- అహ్మదాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పుష్పవతి’ నదీ తీరాన ఉండే ఈ దేవాలయంలో మొత్తం మూడు భాగాలున్నాయి. ఇందులో మొదటి భాగం సూర్య కుండ. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.
- ఆలయంలోని గుర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహం కిరీటంపై రత్నం మీద పడటం వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది.
- నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై అందంగా చెక్కి ఉంటాయి. ఇందులో శ్రీరాముడు, సీత, అయోధ్య నుంచి లంకకు సంబంధించిన చిత్రాలన్నీ కనిపిస్తాయి. మహాభారత కాలానికి సంబంధించిన కథల చిత్రాలు కూడా అప్పట్లోనే చెక్కించారు
- ఆలయం వెలుపల ఉన్న గోడలపై మొత్తం 364 ఏనుగులు, ఒక సింహం ఉన్నాయి. ఇవి క్యాలెండర్ లోని ఒక సంవత్సరంలోని రోజులను తెలియజేస్తాయి.
- ఆలయ గర్భగుడికి మొత్తం 10 దిశలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ 108 ఏనుగుల శిల్పాలు ఉన్నాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో శివుడు, ఉత్తర దిశలో కుబేరుడు, పశ్చిమంలో వరుణుడు, వాయువ్య దిశలో వాయుదేవుడు, నైరుతిలో నిరుత్ర భగవానుడు, దక్షిణ దిశలో యముడు, ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడు...ఆలయం పైభాగంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేశారు.
- అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మన దేశంలో కూల్చివేతకు గురైన చాలా ఆలయాల్లో ఇదికూడా ఒకటి. 2014లో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.
Also Read: జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం - వసంత పంచమి ప్రత్యేకత
స్కందపురాణం - బ్రహ్మపురాణంలో ప్రస్తావన
స్కందపురాణం, బ్రహ్మపురాణాలను అనుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు. రావణ సంహారం అనంతరం బ్రహ్మ హత్యాపాతకం నుంచి బయట పడేందుకు పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని..అప్పుడు వశిష్ట మహర్షి ' ధర్మరన్య' వెళ్ళమని చెప్పాడని పురాణ కథనం. ఆ ప్రాంతాన్నే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలుస్తున్నారు.
రథసప్తమి జనవరి 28న వచ్చింది. ఈ రోజు సూర్యారాధనకు అత్యంత శ్రేష్ఠమైన రోజు.. సూర్యుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటూ..ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు...
సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్