By: RAMA | Updated at : 24 Jan 2023 06:34 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Basant Panchami 2023: ఈ ఏడాది (2023) వసంత పంచమి జనవరి 26 గురువారం వచ్చింది. ఈ రోజునే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం. అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో పంచమి తిథిరోజు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
సరః అంటే కాంతి..కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ. తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకే ఈ తల్లి చేతిలో ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాలతో అవసరం ఏముంటుంది. ఈ తల్లి కొలువైన బాసరలో..వసంతపంచమి వేడుకలు మరింత ప్రత్యేకం..
Also Read: ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్నిచ్చే శ్యామల నవరాత్రులు - జనవరి 22 నుంచి ప్రారంభం
బాసరగా మారిన వ్యాసర
బ్రహ్మాండ పురాణంలో బాసర స్థల మహత్యం ప్రస్తావనకు వస్తుంది. అందులో ప్రముఖంగా వినిపించే కథ వ్యాసుడిది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసుడు ప్రశాంతంగా తపస్సుని ఆచరించేందుకు గోదావరీ తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నాడట. ఇక్కడి గోదావరిలో స్నానమాచరిస్తుండగా వ్యాసులవారికి సరస్వతి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుడు నిత్యం పిడికెడు ఇసుకను తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించాడు. అదే ఇప్పుడు కనిపించే మూలవిరాట్టు అని చెబుతారు. ఆ మూలవిరాట్టుకి నిత్యం పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారులు. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఓ చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది...అలా అలా రూపాంతరం చెందుతూ వ్యాసర కాస్తా బాసరగా మారింది.
సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనురాలై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.
Also Read: మీరు నాన్ వెజ్ తింటున్నారా - అయితే ఈ 8 మందికి హింసాదోషం తప్పదు!
ఉత్తరాదిన వసంతపంచమి
ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు.పంజాబ్,బిహార్ రాష్ట్రాల్లో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి గాలిపటాలు ఎగరేస్తారు. అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టటం ఇంకో విశేషం. ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి, కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు.
Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు
Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు
Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!
2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్
February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?