News
News
X

Non-veg Rules In Week Days: మీరు నాన్ వెజ్ తింటున్నారా - అయితే ఈ 8 మందికి హింసాదోషం తప్పదు!

శనివారం మాంసాహారం తినడం నిషిద్ధమా..అసలు తినకూడదా. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు ఏ వారం అయినా తగ్గేదే లే అంటూ తినేస్తుంటారు కదా..ఏమవుతుంది..

FOLLOW US: 
Share:

Non-veg Rules In Week Days: హిందూ మతవిశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించేవారిలో దాదాపు సగం మందికి అవెందుకు పాటిస్తున్నామో.. వాటిని పాటించడం వల్ల లాభం ఏంటో...అనుసరించకపోతే ఏమవుతుందన్నది తెలియదు. పెద్దలు చెప్పారు ఫాలో అవుతున్నాం అని కొందరంటే..అలా చేయకపోతే ఏమైనా అవుతుందేమో అని  భావించేవారు ఇంకొందరు. వాటిలో ఒకటి శనివారం మాంసాహారం తినకూడదనే ప్రచారం. సాధారణంగా పూజలు, పండుగలు సమయాల్లో ఇంట్లో మాంసాహారం ముట్టుకోనివారెందరో. అయితే కొందకు కేవలం ముఖ్యమైన రోజుల్లోనేకాకుండా శనివారం రోజు కూడా మాంసాహారం తినరు...ఇది కేవలం భక్తిభావం మాత్రమే అనుకుంటే పొరపాటే.. దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలుకూడా ఉన్నాయి. 

పురాణాల ప్రకారం
ఒక జంతువుని చంపేవాడు ,చంపటానికి ఇష్టపడే వాడు, చంపమని చెప్పేవాడు, దాని మాంసం అమ్మే వాడు, కొనే వాడు, తీసుకుని వెళ్ళే వాడు, దాన్ని ముక్కలు చేసి వండే వాడు, దాన్నితినే వాడు ఈ ఎనిమిది మందికి హింసా దోషం తప్పక ఉంటుంది. అలాగే పుణ్య కార్యాలు గానీ పాప కార్యాలు గానీ చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణ చేసేవాడు, చూసి సంతోషించే వాడు, ఆయా పనులకి తగ్గ సమాన మైన ఫలితం పొందుతారు. మానవుల ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాల ముఖ్యమైన స్థానం ఉంది.  

ఇంద్రియాణం నిరోదేన రాగ ద్వేష క్షయేణ చ 
అహింసాయా చ భూతానా మమృతత్వాయ కల్పతే 
అంటే ఇంద్రియ నిగ్రహం వలనా, రాగద్వేషాలని వదిలెయ్యడం వలనా, సర్వ జీవాలపట్ల అహింసని అవలంబించడం వలనా అమృతత్వము అంటే మోక్షం కలుగుతుందని చెప్పబడింది. 

యో బంధన వధక్లేశాన్ ప్రాణీనాం న చికీర్షతి 
స సర్వస్య  హితప్రేప్సు:  సుఖ మత్యంత మశ్నుతే 
అంటే ఎవరు ప్రాణులని చంపడానికి గానీ, బంధించడానికి గానీ, వాటిని బాధ పెట్టడానికి గానీ ఇష్టపడరో, ఎవరైతే  ప్రాణుల  హితము కోరతారో వాళ్ళు అనంతమైన సుఖాన్ని పొందుతారు అని అర్థం

అనుమాన్తా విశసితా నిహన్తా క్రయవిక్రయా 
సంస్కర్తా చోపహర్తాచ ఖాదకశ్చేతి ఘాతకాః 
మాంసం తిన్నవాడు, పెట్టిన వాడు, వండిన వాడు, అమ్మిన వాడు, ప్రాణికి చంపిన వాడు, అవయవములు విడదీసిన వాడు, దానికి అనుమతించిన వాడు అందరూ ఆ జీవిని చంపిన వాళ్ళే అవుతారు. 

యో ఆ హింసకాని భూతాని హినస్త్యా త్మ సుఖేచ్ఛయా 
సజీవంశ్చ మృత శ్చైవ న క్వచి త్సుఖమేధతే 
హింస కలిగించని ప్రాణులని అవి జంతువులైనా కావచ్చు మనుషులైనా కావొచ్చు.. తమ సుఖం కోసం ఎవరైతే హింసిస్తారో వాళ్ళు బ్రతికున్నా కూడా చచ్చిన వాళ్ళ కిందే లెక్క.  అటువంటి వాళ్ళకి ఇహ పరములు రెండిట్లోనూ సుఖం ఉండదు. అయితే తప్పని సరి పరిస్థితులలో కేవలం ఆత్మ రక్షణ కోసం ఆయుధం తీసి ఉపయోగించడం తప్పు కాదు

అహింసయేంద్రియా సంగై  ర్వైదికైశ్చైవ కర్మభిః 
తప్సశ్చరణై శ్చోగ్రై: సాధయనన్తీ హ తత్పదమ్ 
సర్వ ధర్మాల్లో సత్యం అహింసలకి అగ్రస్థానం ఇస్తారు. అయితే హింస లేకుండా మనం బ్రతకగలమా  ? అన్న ప్రశ్న వస్తుంది.  ఎందుకంటే మనం నడిచేటప్పుడు అనేక మైన క్రిమి కీటకాలు మన కాళ్ళ కింద పడి చనిపోతున్నాయి కదా ? అలాగే ఆకు కూరల్లోనూ ప్రాణము లేదా ?  ఈ హింస చేస్తున్నప్పుడు ఆ హింస ఎందుకు చెయ్యకూడదు అని కొందరి వాదన. వీటికి సమాధానం మనువు చెప్పాడు... ప్రాణులకి హాని తలపెట్టడం అన్నది ఎంత తక్కువ అయితే అంత ఉత్తమం.. అసలు వాటికి హాని తలపెట్టకపోవడం  సర్వోత్తమం

Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి

 • జీవ హింస పాపం..కనీసం ఒక్కరోజు మాంసాహారం తినడం మానేసినా కొంతలో కొంత జీవహింస తగ్గుతుందని భావన
 • అతిగా నాన్ వెజ్ తినడం అనారోగ్యానికి సూచన..శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు పెరుగుతాయి..
 • గుండె కు సంబంధించిన సమస్యలు, పెద్దప్రేగు క్యాన్సర్, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, మూలవ్యాధులు లాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఒక్కరోజైనా పూర్తిగా నాన్ వెజ్ కి దూరంగా ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కొంతలో కొంత బయటపడొచ్చు.
 • నాన్ వెజ్ అస్సలు తినకూడదా అంటే అదేం లేదు..శరీర పోషణకు కొద్దిపాటి మాంసం సరిపోతుంది..అంతవరకే తీసుకోవడం మంచిది
 • మాంసాహారుల కన్నా శాఖాహారులు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకోసమైనా నిత్యం మాంసాహారం తినేవారు మధ్యమధ్యలో చిన్న బ్రేక్ ఇవ్వడం మంచిది
 • అందుకే దేవుడి పేరు చెప్పి తినకూడదు అంటేనైనా దూరంగా ఉంటారని అంటారు కానీ..ప్రత్యేకంగా శనివారం రోజు నాన్ వెజ్ తింటే ఏదో జరిగిపోతుందన్నది అపోహ మాత్రమే
 • మంగళవారం, గురువారం కూడా నాన్ వెజ్ తినకూడదని..ఆరోజుల్లో తింటే మహాపాపమనే ప్రచారం జరిగింది. వాస్తవానికి హిందువులకు ప్రతి రోజూ ప్రవిత్రమే. వారంలో ప్రతిరోజూ ఒక్కో దేవుడికి అంకితం చేశారు.. ఆరోజుల్లో వారి వారి ఆచారాన్ని బట్టి ఉపవాసాలు, ఆరాధనలు ఉంటాయి. 

Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం

ఆదివారం- సూర్య భగవానుడు
సోమవారం- శివుడు
మంగళవారం- హనుమంతుడు, కార్తికేయుడు
బుధవారం-రాముడు, అనంతపద్మనాభుడు, అయ్యప్పస్వామి
గురువారం- శ్రీమహావిష్ణువు, సాయిబాబా
శుక్రవారం- మహాలక్ష్మీ, పార్వతి, యోగ నరసింహ
శుక్రవారం- సంతోషి మాత, అన్నపూర్ణేశ్వరి, దుర్గ
శనివారం- వెంకటేశ్వర స్వామి, శనీశ్వరుడు, హనుమంతుడు
ఇలా వారంలో ప్రతిరోజూ ఒక్కోదేవుడుకి అంకితం చేశారు..కొందరి అభిప్రాయం ప్రకారం తమను తాము నియంత్రించుకుని మాంసాహారానికి దూరంగా ఉండటానికే ఇలాంటి కట్టుబాట్లను అనుసరిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా కొన్ని రోజులను నిర్ణయించుకుని నాన్ వెజ్ కి దూరంగా ఉంటున్నారు కానీ..ఆ రోజుల్లో మాంసాహారం తింటే ఏదో జరిగిపోతుందన్నది అపోహ మాత్రమే. ఏ రోజు తినాలి, ఏరోజు మానెయ్యాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Published at : 20 Jan 2023 11:39 AM (IST) Tags: Hindus Why Hindus Do not eat Non veg Do not eat Non veg tuesday Do not eat Non veg saturday Non-veg Rules In Week Days

సంబంధిత కథనాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Antarvedi Utsavalu : జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు

Antarvedi Utsavalu : జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?