అన్వేషించండి

Ratha Saptami 2023 :ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి

ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28న వచ్చింది. ఈ రోజు సూర్యారాధనకు అత్యంత శ్రేష్ఠమైన రోజు.. ఇంతకీ సూర్యుడిని ఎందుకు పూజించాలి..

Ratha Saptami 2023 Date & Time: భగవంతుడు లేడు అనేవారు ఉండచ్చుగానీ..వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన..నిత్యం కనిపించే సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు..ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యంకాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించేవారెందరో.  ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28 శనివారం వచ్చింది

విధినిర్వహణలో ఆదర్శం
విధినిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు..ఉదయం, సాయంత్రం ఎప్పుడూ వేళను అతిక్రమించడు. 

Also Read: దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు

ఆహారానికి, సంపదకు మూలపురుషుడు
సృష్టిలోని సంపదకు, ఆహారానికి ఆదిత్యుడే మూలపురుషుడు. సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుడిని ప్రార్థిస్తే..అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే.  సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతక మణిని పొందుతాడు. ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది. 

విజ్ఞానానికి మూలం సూర్యుడు
విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు . సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ అందిస్తున్నది సూర్యుడే. జీవుల పుట్టుకకు, పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి. 

Also Read: 2023లో ఈ 5 రాశులవారిపై శుక్రుడి అనుగ్రహం - ఏడాదంతా ఆర్థికంగా తిరుగుండదు!

శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు. పంచ భూతాల్లో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరుచక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు..వెలుగు అన్నిటికన్నా వేగవంతమైనది. 
సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. 

అందుకే సూర్యుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటూ..ఆయుష్షు,  ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు...

"ఓం హ్రీం సూర్యాయ నమః"

సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

నోట్: కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాన్నది పూర్తిగా మీవ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget