Saturn and Venus 2023:దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు
ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Saturn and Venus 2023:దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు Saturn and Venus 2023 Venus outshines Saturn in twilight conjunction, snuggle in the sky Sunday Jan 22 Saturn and Venus 2023:దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/f6e86543be4f0091bf32b65a94f4f3e91673935748357217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saturn and Venus 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని-శుక్రుడిని స్నేహితులుగా పరిగణిస్తారు. జనవరి 17 నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 22న శుక్రుడు కూడా మకర రాశి నుంచి నిష్క్రమించి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో జనవరి 22న యుక్త యోగం ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి. మరికొన్ని రాశులవారికి మాత్రం ఇది యోగకాలమనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారికి మాత్రం అద్భుతంగా ఉంది. అందులో మీరున్నారా....
మేష రాశి
ఈ రాశి వారికి కుంభరాశిలో శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. గడిచిన రోజులకన్నా ఆదాయం పెరుగుతుంది, వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారుయ ఉద్యోగులు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఇంక్రిమెంట్, ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అనుకోని ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి.. రాని బాకీలు వసూలవుతాయి. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది.
Also Read: 2023లో ఈ 5 రాశులవారిపై శుక్రుడి అనుగ్రహం - ఏడాదంతా ఆర్థికంగా తిరుగుండదు!
వృషభ రాశి
శని-శుక్రుడు మకరరాశిలో సంచరించడం వల్ల వృషభరాశివారికి కూడా ఇది యోగకాలం అనే చెప్పాలి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు విశేష ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగంలోకి మారాలి అనుకున్నవారికి ఇదే శుభసమయం. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి.శని అనుగ్రం మీపై ఉంటుంది...కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విలాసాలు పెరుగుతాయి. కుటుంబంతో కలసి దూరప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.
సింహ రాశి
శని-శుక్రుడు..ఈ రాశినుంచి ఏడో స్థానంలో సంచరిస్తున్నారు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేయాలి అనుకుంటే ఇదే శుభసమయం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి..కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. బంధాలు మరింత బలపడతాయి. వ్యాపారులకు ప్రయోజనకరమైన సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
మకర రాశి
మీ రాశినుంచి శని కుంభ రాశికి మారడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మకర రాశినుంచి రెండో స్థానంలో శని సంచారం ఉంటోంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకోని ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కలిసొస్తాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. మీ మాటతీరే మీ బంధాలను నిలబెడుతుందన్నది గుర్తుంచుకోవాలి. ఈ రాశివారు మార్కెటింగ్, సేల్స్ రంగంలో ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)