అన్వేషించండి
Advertisement
Scorpio Horoscope 2023: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
Vruschika Rasi Phalalu 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Scorpio Yearly horoscope 2023 : 2023లో వృశ్చికరాశివారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ వెంటనే ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు ఈ ఏడాది మొత్తం మీ ప్రభావం చూపిస్తాయి.వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల 2023లో ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటూ ఆనందం, శాంతి కూడా ఉంటాయి
- 2023 కెరీర్ జీవితంలో చాలా మార్పులొచ్చే సమయం ఇది. గతంతో పోల్చుకుంటే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. క్రమశిక్షణతో పనులు నిర్వహిస్తేనే ప్రయోజనం పొందుతారు.ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు కానీ జూన్ నెలలో చిన్న సమస్య ఎదురుయ్యే అవకాశం ఉంది. కెరీర్లో ఆకస్మికంగా హెచ్చుతగ్గులుంటాయి. అక్టోబరు నెలలో వ్యాపారంలో మార్పులుంటాయి.
- వివాహం పరంగా 2023 వృశ్చిక రాశికి మంచిది. సంవత్సరం ప్రారంభంలో వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది కానీ రాను రాను సమస్యలు పెరుగుతాయి
- ఆరోగ్యం పరంగా చూస్తే 2023లో వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. తరచూ మీ జీవితంలో వచ్చే కొన్ని మార్పులు అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయి. శారీరక సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అక్టోబర్ తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- 2023 ఈ సంవత్సరం వృశ్చికరాశి ప్రేమికులకు ఒడిదొడుకులు తప్పవు. అవివాహితులకు పెళ్లిజరుగుతుంది కానీ ప్రేమికులకు మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోక తప్పదు.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
వృశ్చిక రాశివారి నెలవారీ ఫలితాలు
- జనవరి నెలలో మీరు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణం కలిసొస్తుంది. చదువుపరంగా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి
- ఫిబ్రవరి నెలలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఇల్లు మారే అవకాశం ఉంది. ఎక్కువ ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.
- మార్చి నెలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది..అప్రమత్తంగా ఉండండి. ప్రతి పనిని ఓర్పుతో చేయాలి. మీరు సంబంధాలలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఏప్రిల్ నెలలో చాలా మార్పులు జరుగుతాయి..ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు, శారీరక అసౌకర్యం పెరుగుతుంది. చదువుకి సంబంధించిన సమస్యలు వెంటాడతాయి. అధిక ఒత్తిడికి దూరంగా ఉండండి - మేలో మీకు కలిసొచ్చే సమయం. ఓ రకంగా చెప్పాలంటే రాజయోగమే. అదృష్టం పెరుగుతుంది. మీ సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాలు పొందుతారు. ఇదే సమయంలో కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త.
- జూన్ నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే ఆ సమస్యలు మరింత పెరుగుతాయి.
- జూలై నెల సంతృప్తికరంగా ఉంటుంది. ఈ నెలలో పనిలో సానుకూల మార్పులు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలలో వృద్ధి, ఆర్థిక పురోగతి ఉంటుంది. పని కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీ కెరీర్‌లో పురోగతిని ఉంటుంది
- ఆగస్టు నెలలో ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడపుతారు. ఆరోగ్యం బావుంటుంది.
- సెప్టెంబరులో వృశ్చికరాశి వారికి మంచిరోజు. కుటుంబంలో వివిధ సమస్యలు ఉండవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మానసికంగా ఆందోళన చెందుతారు
- అక్టోబర్ నెలలో విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది. విదేశాల్లో ఉద్యోగావకాశాలు కూడా రావచ్చు. నిద్ర సమస్యలు మరియు ఒత్తిడి మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
- నవంబర్ లో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో చాలా మార్పులు ఉండవచ్చు.
- డిసెంబర్ లో మీ కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో ఆశించిన మార్పు ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుతాయి.
Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion