News
News
X

Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం

స్వప్న శాస్త్రం: కొన్ని కలలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, మనల్ని అప్రమత్తం చేస్తాయి లేదా మన భవిష్యత్తు గురించి హెచ్చరిస్తాయి. మరి అదృష్టాన్ని ఇచ్చే కలల గురించి తెలుసా...

FOLLOW US: 
Share:

Swapna Shastra: నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. కలలకు కాళ్లుండవు అన్నట్టు..ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి...ఇలలో ఊహించనివి కలలో జరిగిపోతుంటాయి. వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు. నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో మనసెక్కడ తిరుగుతుందో అదే కలగా కనిపిస్తుందంటారు. అందుకే ఇలలో సాధ్యం కాదు అనుకున్న విషయాలు చాలా కలలో జరుగుతుంటాయి. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం.   అయితే చాలా కలలు మీ భవిష్యత్ కు సంకేతం అంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఈ కల మళ్లీ వస్తే బావుండును అనిపించేవి కొన్నైతే..అమ్మో ఇలాంటి కల మళ్లీ రాకూడదు అనిపించేవి కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా కలలో ఈ 5 కనిపిస్తే మీ తలరాత మారిపోతుదంటారు స్వప్నశాస్త్ర నిపుణులు.

తామర పూలు
కలలో తామర పూలు కనిపిస్తే అది మీ తలరాత మారబోతోందనడానికి సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు. అప్పుల బాధలనుంచి విముక్తి కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.

తేనెపట్టు
కలలో తేనెపట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి కల జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. వెంటాడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. 

Also Read: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!

పాలిస్తున్న ఆవు
ఆవు దగ్గర దూడ పాలుతాగడం కనిపిస్తే చాలా మంచి కలగా చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అకాస్మాత్తుగా ఆర్థిక లాభం ఉండొచ్చు. ఆస్తివివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు

చిలుక కనిపిస్తే
చిలుకలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు. ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని అర్థం. మీ జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని అంటారు.

చీమలు కలలో కనిపిస్తే
చీమలు సంపదను కూడబెట్టడంలో మేటి. అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది. త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం. 

Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి

గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే
 గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం.వ్యాపారులు లాభపడతారని సంకేతం. ఉద్యోగస్థులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే ఓకే కానీ గుర్రంపైనుంచి పడుతున్నట్లు వస్తే కెరీర్ లో మీరు కూడా అలానే కిందకు దిగజారతారని అర్థం. 

కలలో బంగారు నాణేలు కనిపిస్తే
కలలో బంగారు నాణేలను చూడటం సూర్యుడికి సంబంధించినది. సూర్యుడు ఉత్సాహానికి సూచన. ఏదైనా పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సంతోషంగా ఉంటాలి. మీరు చేయబోయే పని మీకు మంచి ఫలితాలనిస్తుందని ఈ కల అర్థం.

నోట్: నిపుణులు, కొన్నిపుస్తకాల్లో సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

Published at : 19 Jan 2023 07:33 AM (IST) Tags: Dream Interpretation Swapna Shastra luckey dreams money dreams

సంబంధిత కథనాలు

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం -  ఫిబ్రవరి రాశిఫలాలు

Jaya Ekadashi 2023 : ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలాచేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం

Jaya Ekadashi 2023 : ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలాచేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం

Horoscope Today 01st February 2023: ఈ రాశివారి ఉదయం కన్నా సాయంత్రం ఉత్సాహంగా ఉంటారు, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

Horoscope Today 01st February 2023: ఈ రాశివారి ఉదయం కన్నా సాయంత్రం ఉత్సాహంగా ఉంటారు, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని