మేష రాశి మేష రాశి వారి జీవితంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు సమసిపోతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి, ఎక్కువ ఆనందం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ప్రేమ పరంగా పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.
వృషభ రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయం తగ్గుతుంది-ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై శ్రద్ధ పెట్టాలి.
మిథున రాశి ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది. కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపార పనుల పరంగా ఈ రోజు మంచి రోజు.
కర్కాటక రాశి ఇంటర్వూకి హాజరయ్యేవారు మనసుని ప్రశాంతంగ ఉంచుకోండి. త్వరలోనే శుభవార్త వింటారు. మీరు ఏ పని ఎంతవరకూ చేయగలరో ఆలోచించి చేయండి...అధిక ఒత్తిడికి గురికావొద్దు. వ్యాపార భాగస్వామ్యాలకు దూరంగా ఉండడం మంచిది.
సింహ రాశి ఈ రోజు మీరు లాంగ్ ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రయాణం మీకు మేలుచేస్తుంది. కుటుంబంతో సంతోషంగా స్పెండ్ చేస్తారు. మీ తండ్రి నుంచి కొన్ని ప్రయోజనాలు పొందుతారు.
కన్యా రాశి ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో అందరితో సమన్వయం ఉంటుంది. కొత్త వనరుల నుంచి ఆకస్మిక ధనలాభం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు.
తులా రాశి భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఒకరి గురించి మీకు పూర్తి సమాచారం ఉండి..తనని బాగా అర్థంచేసుకున్నాక మాత్రమే స్నేహం చేయండి. ఈ రోజు కొంత చికాకుగా ఉంటుంది. తల్లికి సంబంధించిన వారినుంచి డబ్బు పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయం బావుంటుంది. రోజు గడుస్తున్న కొద్దీ ఖర్చు పెరుగుతుంది. జలుబు , దగ్గుతో ఇబ్బంది పడతారు. కొంతమందికి విదేశీ పర్యటనకు వెళ్ళడం గురించి శుభవార్త అందుతుంది.
ధనుస్సు రాశి ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్ లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంతానం వైపు నుంచి సంతోషం ఉంటుంది.
మకర రాశి ఈ రోజు మీ అతి పెద్ద కల సాకారమవుతుంది. స్వల్ప దూర ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామి నుంచి ఆనందం , ప్రేమను పొందుతారు.
కుంభ రాశి ఈ రోజు మీకు ప్రశాంతమైన రోజు. మానసికంగా, శారీరకంగా కలత చెందిన వారు తమ సమస్యను అధిగమిస్తారు. పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీకు కలిసొస్తుంది. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మీన రాశి ఈ రోజు మీకు మంచి రోజు. మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి మీరు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.